Breaking News

తదుపరి విచారణ వరకు విజయ్‌పాల్‌పై కఠిన చర్యలొద్దు

Published on Sat, 10/05/2024 - 08:03

సాక్షి, న్యూఢిల్లీ: సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ ఆర్‌.విజయ్‌పాల్‌పై తదుపరి విచారణ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని గుంటూరు నగరపాలెం పోలీసులను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈమేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.  ప్రతివాదులుగా ఉన్న పోలీసులు, ఫిర్యాదుదారు రఘురామకృష్ణరాజుకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

 2021లో సీఐడీ అధికారులు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు  ఫిర్యాదు ఆధారంగా నగరపాలెం పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. ఇందులో నిందితునిగా ఉన్న విజయ్‌పాల్‌ ముందస్తు బెయిల్‌ కోసం ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, సిద్దార్థ్‌ దవే, న్యాయవాదులు వరుణ్‌ బైరెడ్డి, చోడిశెట్టి శరణ్‌ వాదనలు వినిపించారు. 2021లో జరిగిన ఘటనపై మూడేళ్ల తరువాత 2024లో రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారన్నారు. ఇంత అసాధారణ జాప్యం ఎందుకు జరిగిందో ఫిర్యాదుదారు చెప్పలేదని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు విజయ్‌పాల్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిందన్నారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)