Breaking News

‘గో మూత్ర’ వ్యా‍ఖ్యలపై డీఎంకే ఎంపీ కీలక ప్రకటన

Published on Wed, 12/06/2023 - 13:46

న్యూఢిల్లీ: ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్లమెంట్‌లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ సెంథిల్‌ కుమార్‌  ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం పార్లమెంట్‌లో  ఒక ప్రకటన చేశారు.

‘నిన్న నేను చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఎవరి మనోభావాలనైనా నేను గాయపరిచి ఉంటే క్షమించండి. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా. పార్లమెంటు రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాలని కోరుతున్నా’అని సెంథిల్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

అంతకముందు ఉదయం సామాజిక మధ్యమం ఎక్స్‌లోనూ పార్లమెంట్‌లో తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్‌ చేశారు. ‘నేను నిన్న కొన్ని మాటలను అసంబంద్ధంగా వాడాను. ఇందుకు నేనువిచారం వ్యక్తం చేస్తున్నాను. క్షమించాల్సిందిగా కోరుతున్నా’అని తెలిపారు. 

కాగా, సెంథిల్‌ కుమార్‌ వ్యాఖ్యలపై బుధవారం ఉదయం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు సహా బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు.ఇలాంటి వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని అవమానించడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ ఎంపీలు కార్తిచిదంబరం, రాజీవ్‌శుక్లా కూడా సెంథిల్‌ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్లమెంటులో మంగళవారం మాట్లాడుతూ గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలిచిందన్న వ్యాఖ్యలు చేసి వివాదం రాజేసిన విషయం తెలిసిందే.

ఇదీచదవండి..భార్య, పిల్లలను చంపి డాక్టర్‌ సూసైడ్‌..కారణమిదే!

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)