ఉదయనిధి స్టాలిన్ విడుదల

Published on Tue, 08/04/2026 - 20:31

చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ విడుదలయ్యారు. తంజావూరులోని సెంగిపట్టి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తుండగా పార్టీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఉదయనిధి స్టాలిన్ సెంగిపట్టి పోలీస్ స్టేషన్ వద్ద నుంచి వెళ్లిపోయారు. నటి త్రిషపై పలు వ్యాఖ్యలు చేసినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఈరోజు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
 
ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్‌ను "డబుల్ మీనింగ్" వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులోనే ఆయనను విచారించిన తర్వాత పోలీసులు విడుదల చేశారు. ఆయనను తంజావూరుకు తీసుకెళ్లి గంటకుపైగా పోలీసులు విచారించారు.

ఈరోజు అంతకుముందు మద్రాస్ హైకోర్టు.. దర్యాప్తునకు అవసరమైనప్పుడు ఉదయనిధి స్టాలిన్ పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. విచారణ పూర్తైన వెంటనే ఆయనను విడుదల చేయాలని పోలీసులకు సూచించింది.

కోర్టు విచారణ సమయంలో తంజావూరు పోలీసుల తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్, ఉదయనిధి స్టాలిన్‌ను తంజావూరుకు తీసుకెళ్లినప్పటికీ న్యాయస్థానపు కస్టడీకి పంపే ఉద్దేశం పోలీసులకు లేదని తెలిపారు. ఆయనను ప్రశ్నించి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)