Breaking News

తమిళ రాజకీయాల్లో కెప్టెన్‌ సంచలనాలు

Published on Thu, 12/28/2023 - 09:50

చెన్నై: డీఎండీకే అధినేత, సినీ నటుడు కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వందకిపైగా చిత్రాలతో తమిళ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారాయన. అయితే.. విజయ్‌ కాంత్‌ అటు సినీ రంగం ద్వారా యాక్షన్‌ హీరోగానే కాదు.. తమిళ రాజకీయాల్లోనూ సొంత పార్టీ డీఎండీకే ద్వారా సంచలనాలు కేరాఫ్‌గా నిలిచారాయన. తద్వారా కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలిత మాదిరే.. విజయ్‌కాంత్‌ తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు.

తన రాజకీయ ప్రస్థానంలో విజయకాంత్‌ రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. 2005 సెప్టెంబర్‌లో విజయ్‌కాంత్‌ డీఎండీకే(దేశీయ మర్పోక్కు ద్రావిడ కజగం) పార్టీని స్థాపించారు. 2006లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మొదటిసారిగా విజయ్‌కాంత్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. విరుదాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారాయన. అయితే.. ఆ  ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీ చేసిన డీఎడీకే తరఫున విజయ్‌కాంత్‌ ఒక్కడే విజయం సాధించారు. అనంతరం, 2009 జనరల్‌ ఎలక్షన్స్‌లో 40 స్థానాల్లో డీఎండీకే పోటీలో నిలిచింది. తమిళనాడులో 39 స్థానాల్లో, పుదుచ్చేరిలో ఒక్క స్థానం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. 

ప్రతిపక్ష నేతగా.. 
2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కాంత్‌ పార్టీ డీఎండీకే పెను సంచలనం సృష్టించింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో డీఎండీకే పొత్తు పెట్టుకుంది. ఎన్నికల్లో డీఎండీకే 41 స్థానాల్లో పోటీ చేయగా 29 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో, విజయకాంత్‌ శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఐదేళ్లపాటు.. అంటే 2016 ఎన్నికల వరకు శాసనసభపక్ష నేతగా కొనసాగారు. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో పరాజయం పొందారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే పోటీ చేయగా ఘోర ఓటమిని చవిచూసింది.

2016 ఎన్నికల తరువాత, జయలలిత, విజయకాంత్ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ కారణంగా విజయకాంత్ అన్నాడీఎంకే నుండి విడిపోయాడు. ఇక, బీజేపీతో డీఎండీకేతో ఎన్డీయే నాయకుల సంప్రదింపులు జరిపారు. ఒకానొక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ.. విజయ్‌కాంత్‌కు ప్రత్యేక సూచన ఇచ్చి ఆయనను తన స్నేహితుడిగా పేర్కొన్నారు.   పార్టీలో చోటుచేసుకున్న వెన్నుపోటు రాజకీయాల కారణంగా విజయ్‌కాంత్‌ ఆరోగ్యం క్షీణించింది. ఆయన తరచుగా ఆసుపత్రిపాలు కావాల్సి వచ్చింది. 

ఇదీ చదవండి: కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ అస్తమయం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌