Breaking News

బెంగళూరు సేఫ్: డీకే శివకుమార్

Published on Fri, 09/19/2025 - 09:34

బెంగళూరులో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని చెప్పడమే కాకుండా, నగరాన్ని గుంతల నగరంగా.. కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అభివర్ణించారు. వసతుల కొరతపై కినుక వహించిన కంపెనీలు బెంగళూరును వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడానికి చూస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. దీనిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ స్పందించారు.

''బెంగళూరు సురక్షితంగా ఉందని భావిస్తేనే.. కంపెనీలు ఇక్కడ వ్యాపారం చేస్తాయి. ప్రస్తుతం ఇక్కడ ఇన్ని కంపెనీలు ఎందుకు ఉన్నాయి?.. ఎందుకంటే ఇక్కడ 25 లక్షలకు పైగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఈ సంఖ్య కాలిఫోర్నియాలో కేవలం 1.3 లక్షలు మాత్రమే. బెంగళూరులో సుమారు 2 లక్షల మంది విదేశీయులు పనిచేస్తున్నారు. ఎందుకు?, ఎందుకంటే ఇక్కడ ప్రతిభ ఉంది" అని శివకుమార్ అన్నారు.

కుమారస్వామిని లక్ష్యంగా చేసుకుని.. ''రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులను ఏర్పాటు చేసే బాధ్యత ఆయనదే. ప్రధానమంత్రి నుంచి కనీసం రూ. 10,000 కోట్లు నిధులను తీసుకురావచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేస్తుందనిగానీ.. రాష్ట్రంలోని సమస్యలను గురించి ఆయన ఎప్పుడూ కేంద్రానికి విన్నవించరు. వార్తల్లో ఉండటానికి మాత్రమే ట్వీట్ చేస్తున్నారు" శివకుమార్ అన్నారు.

గుంతల సమస్యపై ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. భారీ వర్షం వల్ల రోడ్ల పరిస్థితిని కొంత అస్తవ్యస్తంగానే ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించాము. ఇందులో దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకున్నాము. శనివారం జరగబోయే మరో సమావేశానికి సంబంధిత అధికారులు ఒక ప్రణాలికను తీసుకువస్తారు.

నవంబర్ నాటికి గుంతలను పూడ్చడానికి కాంట్రాక్టర్లకు తుది గడువు ఇచ్చామని శివకుమార్ పేర్కొన్నారు. నగరంలో రోడ్ల మరమ్మత్తులు, నిర్మాణాల కోసం రూ.1,100 కోట్లు ప్రకటించడం జరిగింది. మా లక్ష్యం పరిశుభ్రమైన బెంగళూరు, ట్రాఫిక్ సమస్యను తగ్గించడం అని ఆయన వెల్లడించారు.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)