Breaking News

ఇది అన్యాయం: డీకే శివకుమార్‌

Published on Mon, 07/15/2024 - 17:15

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సీబీఐ కేసును కొట్టేయాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.

ఈ పరిణామంపై బెంగళూరులో డీకేఎస్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది కచ్చితంగా ఎదురుదెబ్బే. ఏం చేయమంటారు?. పైగా ఇది అన్యాయం’’ అని అన్నారాయన.  నాపై సీబీఐ కేసు.. దర్యాప్తు రాజకీయ ప్రతీకార చర్య అని ప్రతీ ఒక్కరికీ తెలుసు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసు దర్యాప్తు కోసం సీబీఐకి అన్ని అనుమతులు ఇచ్చింది. కానీ, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక సీబీఐకి ఇచ్చిన అనుమతుల్ని వెనక్కి తీసుకుని, లోకాయుక్తాకు ఆ కేసు అప్పగించింది. అయినా కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. 

ఇది ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన అంశం. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించా. కానీ, వాళ్లు(సుప్రీం ధర్మాసనం) కుదరదని చెప్పారు అని డీకే శివకుమార్‌ అన్నారు. అయితే న్యాయపరంగా ఉన్న అన్నిమార్గాలను పరిశీలించి.. మరోసారి అప్పీల్‌ చేస్తానని చెప్పారాయన.

ఇదిలా ఉంటే.. ఇవాళ సుప్రీం కోర్టులో డీకేఎస్‌ పిటిషన్‌ను జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసం విచారణ చేపట్టింది. అయితే.. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని, ఇందులో జోక్యం చేసుకునేందుకు ఏ కారణం కనిపించడం లేదని బెంచ్‌ వ్యాఖ్యానిస్తూ ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.

2013-18 కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా.. మంత్రి హోదాలో డీకే శివకుమార్‌  అక్రమాస్తులు కూడబెట్టారన్నది ప్రధాన అభియోగం.  2020లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పజెప్పింది. దర్యాప్తు జరిపిన సీబీఐ దాని విలువ రూ.74 కోట్ల రూపాయలపైమాటేనని అభియోగాలు నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను ఆయన కర్ణాటక హైకోర్టులో సవాల్‌ చేయగా.. కోర్టు సైతం దర్యాప్తు సంస్థకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)