Breaking News

ఈ దేశాల్లోనూ దీపావళి సెలవులు

Published on Tue, 10/29/2024 - 11:06

న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఈ  పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లోని ప్రజలు బంగారం, వెండి, కార్లు, పాత్రలు, కొత్త బట్టలు మొదలైనవి కొనుగోలు చేస్తారు. అన్ని విద్యా సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలకు దీపావళి రోజున సెలవు ఉంటుంది.

విదేశాల్లో దీపావళి వేడుకల విషయానికొస్తే నేపాల్, బాలి, సింగపూర్ సహా పలు దేశాల్లో దీపావళి సందడి కనిపిస్తుంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తారు. అమెరికాలో అధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు దీపావళి సందర్భంగా వైట్ హౌస్‌లో దీపం వెలిగిస్తారు.  అమెరికాలోని పెన్సిల్వేనియా, న్యూయార్క్‌లలో దీపావళినాడు అధికారిక సెలవుదినంగా ప్రకటించారు.

ఫిజీ: 1879 నుంచి ఫిజీలో దీపావళి నాడు  ప్రభుత్వ సెలవుదినాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.

మలేషియా: మలేషియాలో ప్రభుత్వ సెలవుల జాబితాలో దీపావళి కూడా చేరింది.  

మారిషస్: మారిషస్‌లో హిందువుల జనాభాను పరిగణనలోకి తీసుకుని దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ‍ప్రకటించారు. ఈ ద్వీపంలో దీపావళి సందర్భంగా దీపాలు వెలిగిస్తారు. ఇళ్లను అందంగా అలంకరిస్తారు.

నేపాల్: నేపాల్‌లో దీపావళిని తిహార్ లేదా స్వాంతి అంటారు. అక్కడ ఈ పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు.

శ్రీలంక: శ్రీలంకలో తమిళనాడు చెందినవారు దీపావళిని జరుపుకుంటారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ సెలవులు ఇస్తారు.

సింగపూర్: దీపావళి సందర్భంగా సింగపూర్‌లో ప్రభుత్వ సెలవుదినం. లిటిల్ ఇండియాలో దీపావళి నాడు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్, టొబాగోలో కూడా దీపావళి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఇస్తారు. 

ఇది కూడా చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)