Breaking News

దీపావళి.. ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు?

Published on Thu, 10/24/2024 - 07:07

న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ చీకటి నుండి వెలుగులోకి  మారే పయనాన్ని సూచిస్తుంది. దీపావళి సందర్భంగా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవులు  ప్రకటించారు. అయితే ఈసారి దీపావళిని అక్టోబర్ 31న లేక నవంబర్ 1 న జరుపుకోవాలా అనే గందరగోళం చాలామందిలో నెలకొంది. మరి.. ఈసారి దీపావళికి ఏ రాష్ట్రంలో  ఎప్పుడు సెలవు ప్రకటించారో తెలుసుకుందాం.

యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో దీపావళికి అక్టోబర్ 31 న సెలవు ఇచ్చారు. నవంబర్ 2 న గోవర్ధన పూజకు సెలవు ఉంటుంది. నవంబర్ 3 న భాయ్ దూజ్ పండుగను జరుపుకుంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో ఈ రోజుల్లో మాత్రమే సెలవు దినంగా ప్రకటించారు. అయితే నవంబర్  ఒకటి గురించి స్పష్టంగా తెలియజేయలేదు. మహారాష్ట్రలో సాధారణంగా దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, 2 తేదీలలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు దీపావళి సెలవు ప్రకటించారు. దీపావళికి ముందు, తరువాత పాఠశాలలకు ఏడు నుండి 10 రోజుల వరకూ సెలవులు ఉండవచ్చు. నవంబర్ 1న ఢిల్లీలో దీపావళి సెలవు ఉంటుంది. అయితే కుటుంబ సమేతంగా ఈ పండుగను జరుపుకునేందుకు వీలుగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు పాఠశాలకు సెలవు ప్రకటించారు.

తమిళనాడులో ఈసారి దీపావళి అక్టోబర్ 31, నవంబర్ ఒకటి తేదీల్లో రెండు రోజుల సెలవు ప్రకటించారు. గుజరాత్‌లో దీపావళితో పాటు నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకుంటారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు దీపావళి సందర్భంగా ఇక్కడ మూడు రోజుల సెలవు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో కాళీ పూజ, దీపావళిని కలిసి జరుపుకుంటారు. నవంబర్ 1, 2 తేదీలలో ఇక్కడ దీపావళి సెలవు ఉంటుంది. కాళీ పూజ సందర్భంగా అక్టోబర్ 31న కూడా సెలవు ప్రకటించారు.

దీపావళి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో రెండు రోజులు సెలవులు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు నవంబర్ 1, 2 తేదీలలో మూసివేయనున్నారు. బీహార్‌లో ఈసారి దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, నవంబర్ 2 న ఇక్కడ సెలవు ఉంటుంది. దీనితో పాటు ఛత్ పూజకు సెలవులను కూడా పొడిగించవచ్చు. రాజస్థాన్‌లో ఈ ఏడాది దీపావళికి మూడు రోజుల సెలవులు ఉంటాయి. అక్టోబర్ 31 నుండి నవంబర్ 2 వరకు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నారు.

కర్ణాటకలో దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, 2 తేదీలలో ప్రజలు ఈ పండుగను సాంప్రదాయ రీతిలో జరుపుకుంటారు. కేరళలో దీపావళికి నవంబర్ 1న సెలవు ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, ఒడిశా తదితర రాష్ట్రాల్లో దీపావళి సందర్భంగా రెండు రోజులు సెలవులు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్‌రెడ్డి?

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)