Breaking News

స్కూటర్‌ రిపేర్‌లో జాప్యం.. ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు

Published on Wed, 09/11/2024 - 15:44

బెంగళూరు: తన టూవీలర్‌ రిపేర్‌ చేయలేదని ఓ యువకుడు ఏకంగా ఓలా షోరూమ్‌నే తగలబెట్టాడు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. లక్షల్లో నష్టం వాటిల్లింది. కర్ణాటక కలబుర్గిలో ఈ ఘటన చోటుచేసుకుంది.  

మహమ్మద్‌ నదీమ్‌ అనే వ్యక్తి ఆగష్టు 28న ఓలా షోరూమ్‌లో రూ. 1.4 లక్షలు ఖర్చు చేసి ఎలక్ట్రిక్‌  స్కూటర్‌ కొనుగోలు చేశాడు. అయితే కొన్న రెండు రోజుల్లోనే స్కూటర్‌ బ్యాటరీ, సౌండ​ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. బండి ఊకే ఆగిపోవడం జరిగింది.

ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఓలా  షోరూమ్‌కు వెళ్లినా అధికారులు సరిగా పట్టించుకోలేదు. తన టూవిలర్‌ను సరైన సమాయానికి రిపేర్‌ చేయలేదు. దీంతో కస్టమర్‌ సపోర్టు ఎగ్జిక్యూటివ్‌తో వాగ్వాదానికి దిగాడు. సిబ్బంది నిర్లక్ష్యంతో విసుగు చెందిన నదీమ్‌.. పెట్రోల్‌ పోసి కంపెనీ షోరూమ్‌కు నిప్పంటించాడు.

షోరూమ్ మొత్తం మంటలు వ్యాపించడంతో ఆరు స్కూటర్లు, కంప్యూటర్‌లు  ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో షోరూమ్‌ మూసివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షాప్‌కు రూ.8.5 లక్షల నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు నదీమ్‌ను అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

షో రూమ్ కే నిప్పు పెట్టిన యువకుడు

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)