Breaking News

బస్సులో మొదట మహిళ ఎక్కితే.. కలిసిరాదా..? ఇది ఏం మూఢత్వం..?

Published on Fri, 07/28/2023 - 19:39

భువనేశ్వర్‌: శాస్త్ర సాంకేతికత పెరిగినా మనిషి మూఢత్వాన్ని వదలడంలేదు. ఎవరో ఎదురువస్తే మంచిదంటూ, మరెవరో వస్తే చెడు జరుగుతుందంటూ కొందరు భావిస్తున్నారు. ఏదో ఒక విధంగా ఏదో ఒక వర్గంపై వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఒడిశాలో ఎదురైంది. కొత్తగా తీసుకువచ్చిన బస్సుల్లో మహిళలను మొదటి ప్యాసింజర్‌గా ఎక్కకుండా ఆపేసిన ఘటనపై ఒడిశా మహిళా కమిషన్ మండిపడింది. ఇలాంటి వివక్షను ఆపేయాలని రవాణా డిపార్ట్‌మెంట్‌కు సూచనలు చేసింది. 

ఇటీవల రాష్ట్రంలో కొత్తగా తీసుకువచ్చిన బస్సుల్లో మహిళలను మొదటి ప్యాసింజర్‌గా ఎక్కకుండా భువనేశ్వర్‌లోని బారాముండా బస్సు స్టేషన్‌లో ఆపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాజిక కార్యకర్త ఘాసిరామ్ పాండా రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కమిషన్‌ రాష్ట్ర రవాణా యంత్రాంగానికి తగు సూచనలు చేసింది. మహిళలు మొదటి ప్యాసింజర్‌గా ఎక్కితే.. ఆ రోజు బస్సుకు ప్రమాదమో లేక తక్కువ వసూలు చేయడమో జరుగుతుందని భావించడం వివక్షాపూరితం అంటూ తెలిపింది. ఇది పూర్తిగా మూఢత్వం అని పేర‍్కొంది. 

దీనిపై విచారణ చేపట్టిన మహిళా కమిషన్..  మహిళలను తొలి ప్రయాణికులుగా ఎక్కేందుకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని రవాణాశాఖకు సూచనలు చేసింది. గతంలోనూ ఈ తరహా ఘటనలు వెలుగుచూసినట్లు గుర్తుచేసింది. ఇకముందు మహిళా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా  వారి గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేయాలని స్పష్టం చేసింది.

ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు తమ మొదటి ప్యాసింజర్‌గా మహిళలనూ అనుమతించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సిబ్బందికి ఈ మేరకు అవగాహన కల్పించాలని కోరింది. బస్సుల్లో మహిళల రిజర్వేషన్‌ను 50 శాతానికి పెంచాలని మహిళా కమిషన్ డిమాండ్ చేసింది.

ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)