Breaking News

మధ్యప్రదేశ్‌లో హీటెక్కిన పాలి‘ట్రిక్స్‌’.. దిగ్విజయ్‌ హాట్‌ కామెంట్స్‌

Published on Thu, 08/17/2023 - 09:22

భోపాల్‌: ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక, మధ్యప్రదేశ్‌లో మరోసారి అధికారం కోసం కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. 

వివరాల ప్రకారం.. మాజీ సీఎం కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఎన్నికల కమిటీలో భాగమైన దిగ్విజయ్ సింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి అధికారాన్ని చేపట్టిన తర్వాత భజరంగ్ దళ్‌ను నిషేధించబోమని స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రంలో అల్లర్లను, హింసను ప్రేరేపించే వారిని మాత్రం విడిచిపెట్టబోమని వార్నింగ్‌ ఇచ్చారు. ఇదేసమయంలో ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. భజరంగ్‌ దళ్‌లో కొంతమంది మంచివాళ్లు కూడా ఉన్నారని అన్నారు. రామ మందిరం ఉద్యమం సమయంలో ఏర్పాటైన బజరంగ్ దళ్ అనేది విశ్వహిందూ పరిషత్ కు యువజన విభాగం. నేను కూడా హిందువునే. హిందువుగానే ఉంటాను. నేను హిందు మతాన్ని అనుసరిస్తూనే సనాతన ధర్మాన్ని పాటిస్తానని తెలిపారు. భారతదేశం అన్ని మతాలకు చెందుతుంది. దేశంలో శాంతిని నెలకొల్పడమే కావాలి అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల సందర్భంగా కర్నాటకలో కాంగ్రెస్‌ నేతలు తాము అధికారంలోకి వస్తే భజరంగ్‌ దళ్‌ వంటి సంస్థలను నిషేధిస్తామని వాగ్దానం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇది కూడా చదవండి: రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో రాహుల్‌ గాంధీ!

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)