Breaking News

జల్లికట్టు పోటీలో అపశ్రుతి..నలుగురు మృతి

Published on Tue, 01/17/2023 - 16:10

దక్షిణాదిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించే సం‍ప్రదాయ క్రీడ జల్లికట్టు పోటీల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ మేరకు ఎద్దులతో నిర్వహించే జల్లికట్టు పోటీల్లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు సంఘటనల్లో నలుగురు మృతి చెందారు. ఆదివారం కర్ణాటకలో శివమొగ్గలో ఒక ప్రమాదం జరగగా, శనివారం షికారిపురలో మరో ప్రమాదం జరిగింది.

ఈమేరకు కర్ణాటకలో ఆదివారం నాడు ఎద్దు మీదకు దూకడంతో గాయపడ్డ 34 ఏళ్ల వ్యక్తి సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు, అలాగే మరో వ్యక్తి ఎద్దులు గుంపు మీదకు దూసుకురావడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అలాగే తమిళనాడులోని పాలమేడులో జరిగిన జల్లికట్టులో క్రీడాకారుడు అరవింద రాజన్‌(24) అనే యువకుడుని ఎద్దు ఢీ కొట్టి చంపగా, తిరుచ్చిలో ఒక ప్రేక్షకుడు 25 ఏళ్ల వ్యక్తి ఎద్దు దాడిలో మృతి చెందాడు.

అసలు ఈ జల్లుకట్టు అనేది ఒక ప్రమాదకరమైన సాంప్రదాయ క్రీడ. ఇక్కడ శక్తిమంతమైన యువకులు బలమైన ఎద్దులపై ఆధిపత్య చెలాయించడానకి ప్రయత్నించే ఒక సరదాతో కూడిన ప్రమాదకరమైన క్రీడ. ఈ పోటీలో ఎద్దులు క్రీడా మైదానంలోకి ప్రవేశించగానే అక్కడే ఉండే యువకులు వాటిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ముపురం పట్టుకుని కౌగలించుకోవడానికి యత్నిస్తారు. ఆ సమయంలో వారికే కాకుండా అక్కడ చూస్తున్నవారికి, పక్కనున్నవారు గాయపడే అవకాశాలు ఎక్కువ. 

రూ. 3 లక్షల పరిహారం ప్రకటించిన స్టాలిన్‌
జల్లికట్టులో జరిగిన ఈ ఘటనలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ఈ పోటీల్లో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబాలకు చెరో రూ. 3 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

(చదవండి: రివర్‌ క్రూయిజ్‌ చిక్కుకోలేదు! భద్రత దృష్ట్యా అలా చేశాం)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)