Breaking News

మహిళల్లో కేసులెక్కువ.. పురుషుల్లో మరణాలెక్కువ

Published on Wed, 09/03/2025 - 03:49

సాక్షి, న్యూఢిల్లీ :  దేశంలో కేన్సర్‌ వ్యాధి కేసులు, మరణాల్లో భిన్న వైఖరి కనిపిస్తోంది. మహిళల్లో కేన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదవుతుండగా పురు షుల్లో మాత్రం కేన్సర్‌ మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పులు, మారిన ఆహార అలవాట్లు కేన్సర్‌ వ్యాధికి ఎక్కువగా కారణమవుతున్నాయి. 

2015–2019 మధ్య 43 కేన్సర్‌ రిజిస్ట్రీల్లో నమోదైన గణాంకాలను విశ్లేషించిన ఓ జాతీయ బృందం ఈ ఆందోళనకర వివరాలను బయటపెట్టింది. దీనిప్రకారం 2015–2019 మధ్య 7.08 లక్షల కేన్సర్‌ కేసులు నమోదవగా 2.06 లక్షల మరణాలు సంభవించాయి. ఈ లెక్కన 2024లో దేశవ్యాప్తంగా 15.6 లక్షల కేసులు నమోదై 8.74 లక్షల మరణాలు నమోదై ఉండొచ్చని అంచనా వేసింది.

మహిళల్లో ఎక్కువ కేసులు
2012–2022 మధ్య జాతీయ కేన్సర్‌ రిజిస్ట్రీలు పలు ఆసక్తికర అంశాలను తెరపైకి తెచ్చాయి. మహిళల్లో కేన్సర్‌ కేసులు పురుషుల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా బ్రెస్ట్‌ క్యాన్సర్, సర్వైకల్‌ కేన్సర్‌ బాధితులు మహిళల్లో ఎక్కువగా ఉన్నారు. కానీ ఆశ్చర్యకరంగా మహిళల్లో ఈ కేన్సర్ల కారణంగా మరణాల రేటు తక్కువగా ఉంది. మొత్తం కేసుల్లో మహిళల వాటా 51.1 శాతం. కానీ మరణాల రేటు మాత్రం 45 శాతమే. 

దీనికి ప్రధాన కారణం మహిళల్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్, సర్వైకల్‌ కేన్సర్లు. ఇవి స్క్రీనింగ్‌ ద్వారా ముందే గుర్తించే వీలుండటంతోపాటు ముందస్తుచికిత్సలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. మరోవైపు పురుషుల్లో వచ్చే ఓరల్, లంగ్, లివర్, ఉదర, అన్నవాహిక కేన్సర్లు ఆల స్యంగా నిర్ధారణ కావడంతో మరణాలు అధికంగా నమోదవుతు న్నాయని ఐసీఎంఆర్‌–ఎన్‌సీడీఐఆర్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ మాథూర్‌ తెలిపారు.

పొగాకును నియంత్రించకుంటే మరణాలు తగ్గవు..
ళీ కేన్సర్‌పై పోరులో పురుషుల ప్రవర్తననే పెద్ద శత్రువుగా చూడాలి. పొగాకు నియంత్రణలో కఠిన చట్టాలు అమలు చేయకపోతే మరణాలు తగ్గవు. గ్లోబల్‌ అడల్ట్‌ టొబాకో సర్వే ప్రకారం 2009–10లో 34.6% ఉన్న పొగాకు వినియోగం 2016–17 నాటికి 28.6%కి తగ్గింది. అయినా కేసులు పెరగడానికి పొగాకు దుష్ప్రభావాలకు 20 ఏళ్ల తర్వాత బయటపడే గుణం ఉండటమే కారణం. అధిక మద్యపానం కూడా నోటి కేన్సర్‌ భారాన్ని పెంచుతోంది. మద్యం, పొగాకు రెండూ విడిగా కేన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇక కలిపి వాడితే మరింత ప్రమాదం పెరుగుతుంది.    – డాక్టర్‌ ప్రశాంత్‌ మాథూర్‌

మరణాలకు కారణం అలవాట్లే..
»  పురుషుల్లో ఊపిరితిత్తుల కేన్సర్‌ కంటే నోటి కేన్సర్‌ కేసులు ఎక్కువగా నమో దు అవుతున్నాయి. అందుకు ప్రధాన కారణం గుట్కా, జర్దా, బీడీ, సిగరెట్, పొగాకు విని యోగం అలవాట్లేనని అధ్యయనం పేర్కొంది. అలాగే కేన్సర్‌ లక్షణాలను పురుషులు ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తుండటం వల్ల చికిత్స మొదలుపెట్టే సరికే వ్యాధి మూడు లేదా నాలుగో దశకు చేరుకుంటోందని తెలిపింది. దీంతో చికిత్సలు ఫలితం ఇవ్వడంలేదని అధ్య యనం వివరించింది.

పర్యావరణం, జీవనశైలి ప్రభావం
» అయితే దేశమంతా కేన్సర్‌ కేసుల తీరు భిన్నంగా ఉంటోంది. ఈశాన్య రాష్ట్రం మిజోరాం (ఐజ్వాల్‌)లోని పురుషుల్లో ప్రతి లక్ష మంది పురుషుల్లో 269.4 కేన్సర్‌ కేసులు, అరుణా చల్‌ప్రదేశ్‌ (పపుంపారే) లోని ప్రతి లక్ష మంది మహిళల్లో 227.5 కేన్సర్‌ కేసులు నమోదవుతుండగా మహారాష్ట్రలోని బర్షీలో మాత్రం అతితక్కువ కేన్సర్‌ కేసులు నమోదైనట్లు అధ్యయనం గుర్తించింది. వాయు కాలు ష్యం, ఆహార అలవాట్లు, జన్యు కారణాలు మొదలైన అంశాల వల్ల ప్రాంతాలవారీ వ్యత్యాసం కనిపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్రాంతాలవారీగా కేన్సర్‌ కేసుల తీరు: (ప్రతి లక్ష జనాభాకు)
హైదరాబాద్‌: బ్రెస్ట్‌ కేన్సర్‌ అత్యధికం (54)
ఐజ్వాల్‌: సర్వైకల్‌ కేన్సర్‌ అత్యధికం (27.1)
శ్రీనగర్‌: పురుషుల్లో లంగ్‌ కేన్సర్‌ అత్యధికం (39.5)
ఐజ్వాల్‌ మహిళలు: లంగ్‌ కేన్సర్‌ అత్యధికం (33.7)
అహ్మదాబాద్‌: పురుషుల్లో ఓరల్‌ కేన్సర్‌ అత్యధికం (33.6)
శ్రీనగర్‌: ప్రోస్టేట్‌ కేన్సర్‌ అత్యధికం (12.7)
ఈస్ట్‌ ఖాసీ హిల్స్‌: మహిళల్లో ఓరల్‌ కేన్సర్‌ అత్యధికం (13.6) 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)