Breaking News

మెట్రోలో యువకుని చెంప చెల్లుమనిపించిన యువతి.. వీడియో వైరల్‌..

Published on Tue, 07/04/2023 - 12:31

ఢిల్లీ: ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. మెట్రోలో ప్రయాణికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వారి చర్యలు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా హద్దులు మీరుతున్నారు. కొద్ది రోజుల క్రితమే మెట్రోలో ఇద్దరు యువకులు కొట్టుకున్న ఘటన అనంతరం ప్రస్తుతం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మెట్రోలో ఓ యువతి ఓ యువకున్ని చెంప చెల్లుమనిపించింది. ఏమైందో తెలియదు.. కానీ యువకున్ని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయింది. మిగిలిన ప్రయాణికులు వారికి దూరంగా ఉండి చూస్తూ ఉండి పోయారు. 

మెట్రోలో ప్రయాణికులందరూ ఎవరి పనిలో వారు ఉన్నారు. ఇంతలో ఓ యువతి అక్కడికి వచ్చింది. పక్కనే ఉన్న ఓ యువకుని వైపు దూసుకొచ్చి... అతని చెంప చెల్లుమనిపించింది. బూతులు తిడుతూ మరల యువకునిపై దాడి చేసింది. ఈ ఘటనలో యువకుడు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె అవకాశం ఇవ్వకుండా రెచ్చిపోయింది. ఇదంతా చూస్తున్న జనాలు వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఇద్దరి మధ్య  వ్యక్తిగత గొడవలా భావించి దూరంగా ఉండిపోయారు. 

ఈ దృశ్యాలను  ఓ ప్రయాణికుడు వీడియో తీసి పోస్టు చేశాడు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నెటిజన్ల స్పందనలతో కామెంట్ బాక్స్ నిండిపోయింది. వ్యూయర్స్‌  రకరకాలుగా స్పందించారు. వారిద్దరి మధ్యలోకి చొరవ తీసుకోనందుకు తోటి ప్రయాణికులకు కొందరు ధన్యవాదాలు తెలిపారు. మెట్రోలో ఇలా ప్రవర్తిస్తే అందరికి ఇబ్బంది కలగదా? అని మరికొందరు కామెంట్ చేశారు. 

ఇదీ చదవండి: ఆ మేక.. అతన్ని కంటితోనే చంపేసింది..!

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)