Breaking News

జార్ఖండ్‌లో మరో జంతర్‌మంతర్‌ 

Published on Tue, 08/04/2026 - 06:14

రాంచీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ సారథ్యంలో రోజుల తరబడి కొనసాగి పోలీసుల అతి బలప్రయోగంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘నీట్‌ లీకేజీ’ఉద్యమంతో స్ఫూర్తి పొందిన జార్ఖండ్‌ విద్యార్థిలోకం రాంచీ వేదికగా ఉధృతస్థాయిలో నిరసన కార్యక్రమాలకు ఆరంభించింది. 

జార్ఖండ్‌ పబ్లిక్‌ సరీ్వస్‌కమిషన్‌(జేపీఎస్‌సీ), జార్ఖండ్‌ స్టాఫ్‌ సెలక్షన్‌(జేసీసీ) పోటీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, సీబీఐ, ఈడీలతో కేసులను దర్యాప్తు చేయించి నేరస్తులకు శిక్షలు పడేలా చేయాలని విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. 

ఆదివారం రాత్రి పదిగంటలకు విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్‌ మహతో నిరాహార దీక్షకు కూర్చోవడంతో రాంచీలో పెద్దసంఖ్యలో విద్యార్థులు దీక్షాస్థలికి చేరుకున్నారు. నిరసన ప్రదర్శనలు సోమవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. 14వ జేపీఎస్‌సీ పరీక్ష, జేఎస్‌ఎస్‌సీ–కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ పరీక్షతోపాటు ఇతర రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌లను రద్దుచేయాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. విద్యార్థుల ఉద్యమానికి తాము సైతం మద్దతిస్తున్నట్లు సీజేపీ చీఫ్‌ దీప్కే సోమవారం ప్రకటించారు.  

చిన్న నిరసనగా మొదలై... 
ఇటీవల నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌ పరీక్షల నిర్వహణ, అర్హుల ఎంపికలో పారదర్శకత లోపించిందని, న్యాయం చేయాలంటూ పలువురు పరీక్షార్థులు జూలై ఐదో తేదీన రాంచీలోని వపు బాటికా మైదానంలో నిరసన చేపట్టారు. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్‌ అయ్యాయని, వాటిని రద్దుచేయాలని నినదించారు. విద్యార్థుల ఈ ప్రదర్శనకు పలు రాజకీయ పారీ్టలతోపాటు పౌరసమాజంలోని పలు సంఘాల నుంచి విపరీతమైన మద్దతు తోడైంది. దీంతో వందలాది మంది విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా కదలిరావడంతో రాంచీలో నిరసన తాజాగా తీవ్రరూపం దాల్చింది. 

జంతర్‌మంతర్‌లో ఎలాగైనా విద్యార్థులు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ దీక్ష కొనసాగించారో అచ్చం అలాగే రాంచీలోనూ పెద్దసంఖ్యలో పరీక్షార్థులు ప్లకార్డులు పట్టుకుని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఓవైపు వర్షాలు, పిడుగుల ఘటనలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నా ఇవన్నీ సైతం లెక్కచేయకుండా విద్యార్థులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ‘‘వర్షాకాలంలో కారుమబ్బులతో కాస్తంత చీకటిపడటం సహజం. కానీ అవినీతి పడగ నీడతో రాష్ట్రంలో పరీక్షార్థుల భవిష్యత్తు అంధకారమవుతోంది’’అని దీక్షాస్థలిలోని ఒక ఉద్యమకారుడు వ్యాఖ్యానించారు. 

జేపీఎస్‌సీ మాజీ ఛైర్మన్‌పై సీఐడీ ప్రశ్నలవర్షం 
పరీక్షల నిర్వహణలో అవకతవకల కేసులో జేపీఎస్‌సీ మాజీ చైర్మన్‌ కె.ఖియాంగ్టేను సీఐడీఅధికారులు సోమవారం మరోమారుప్రశ్నించారు. గతంలో జూలై 28(9 గంటలు), జూలై 29(8 గంటలు), జూలై 31 తేదీన ఎనిమిది గంటలపాటు సీఐడీ ప్రశ్నించింది. సోమవారం ఏడు గంటలపాటుప్రశ్నించింది. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే తాను చైర్మన్‌ పదవికి రాజీనామాచేశానని ఖియాంగ్టే తెలిపారు.  

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)