Breaking News

‘మహా’ సీఎం ఎవరు..? నేడు నిర్ణయం వెలువడే ఛాన్స్‌ !

Published on Sun, 11/24/2024 - 05:10

ముంబై:అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం నేపథ్యంలో మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సీఎం, శివసేన చీఫ్‌ ఏక్‌నాథ్‌ షిండేకు మళ్లీ సీఎం పదవి ఇచ్చే అవకాశం లేనట్టేనంటున్నారు. కూటమి సారథిగానే గాక అత్యధిక స్థానాలు నెగ్గిన పార్టీగా బీజేపీకే ఆ అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. 

ఈ ఎన్నికల్లో పార్టీ విజయానికి అహోరాత్రాలు శ్రమించిన ఆయనకు అందలం ఖాయమంటున్నారు. ఢిల్లీకి రావాల్సిందిగా ఆయనకు బీజేపీ అధినాయకత్వం నుంచి ఇప్పటికే పిలుపు కూడా వచ్చినట్లు సమాచారం. ఫడ్నవీస్‌ మాత్రం ఈ అంశంపై ఆచితూచి స్పందించారు. సీఎం ఎవరన్నది మహాయుతి నేతలంతా కలిసి నిర్ణయిస్తారని శనివారం మీడియాకు చెప్పారు.  

ఫలితాల అనంతరం షిండే, ఎన్సీపీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం ఎవరన్న దానిపై అసలు వివాదమే లేదు. దీనిపై చర్చించేందుకు సీఎం షిండేతో నేను, అజిత్‌ పవార్‌ ఆయన నివాసంలో భేటీ కానున్నాం’’అంటూ ముక్తాయించారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు సాఫీగా జరుగుతుందని షిండే కూడా అన్నారు. 

అనంతరం ఫడ్నవీస్‌ మరోసారి మీడియాతో మాట్లాడుతూ సీఎం పదవి తనకే దక్కాలనే అర్థం ధ్వనించేలా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారుల సాయంతో విపక్షాల చక్రవ్యూహాన్ని ఛేదించడంలో విజయం సాధించానని చెప్పుకొచ్చారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)