Breaking News

తీర్పుల జాప్యంపై కొరడా

Published on Thu, 11/13/2025 - 04:56

సాక్షి, న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే దిశగా సుప్రీంకోర్టు ఒక కీలకమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు తీర్పులను రిజర్వ్‌ చేసిన తేదీ, వెలువరించిన తేదీ, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన తేదీ వంటి వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించింది. 

ఇందుకోసం ప్రతి హైకోర్టు తమ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ఒక డాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ముఖ్యంగా, ఆరు నెలలకు పైగా రిజర్వ్‌లో ఉండిపోయిన తీర్పుల వివరాలను, ఆరు నెలల తర్వాత వెలువరించిన తీర్పుల సంఖ్యను తప్పనిసరిగా ఈ డాష్‌బోర్డులో వెల్లడించాలని స్పష్టం చేసింది. 

అసలు ఎందుకీ ప్రతిపాదన? 
జార్ఖండ్‌ హైకోర్టులో తీర్పులు సుదీర్ఘకాలం పాటు రిజర్వ్‌లో ఉండిపోతున్న ఉదంతానికి సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులోని జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ బాగ్చిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలగాలంటే పారదర్శకత అత్యవసరమని అభిప్రాయపడింది. అంతేగాక ‘ప్రతి హైకోర్టులో, ఏ న్యాయమూర్తి ఎన్ని తీర్పులు రిజర్వ్‌ చేశారు, వాటిలో ఎన్ని వెలువరించారు, ఎన్ని రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తిచేశారు.. అనే వివరాలు ప్రజలందరికీ తెలియాలి. 

ఆరు నెలలు దాటినా వెలువరించని తీర్పులు ఎన్ని? ఆరు నెలల తర్వాత వెలువరించినవి ఎన్ని? అన్నింటికంటే ముఖ్యంగా, తీర్పు వెలువరించిన తర్వాత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడానికి ఎన్ని రోజులు పడుతోంది అనేది స్పష్టంగా తెలియాలి’ అని జస్టిస్‌ సూర్యకాంత్‌ నొక్కిచెప్పారు. దీనికి జస్టిస్‌ బాగ్చి స్పందిస్తూ, ‘ఇది ప్రజలకు న్యాయవ్యవస్థ పట్ల పారదర్శకతను, జవాబుదారీతనాన్ని చూపిస్తుంది’ అని అన్నారు. 

హైకోర్టులకు ఆదేశాలు 
ఈ ఏడాది జనవరి 31లోపు రిజర్వ్‌ చేసి, మే 5, 2025 నాటికి కూడా వెలువరించని తీర్పుల వివరాలపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్‌ను గతంలోనే ఆదేశించింది. బుధవారం నాటి విచారణలో, కొన్ని హైకోర్టులు మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశాయని, మిగిలినవి ఇంకా సమర్పించలేదని ధర్మాసనం గుర్తించింది. 

నివేదిక ఇవ్వని రిజిస్ట్రార్ జనరల్స్‌ రెండు వారాల్లోగా అఫిడవిట్లు సమర్పించాలని, లేనిపక్షంలో తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ సందర్భంగా, అమికస్‌ క్యూరీ ఫౌజియా షకీల్‌ నివేదికను పరిశీలించిన ధర్మాసనం, అన్ని హైకోర్టులకు మరికొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. 

ప్రస్తుత విధానంలో భాగంగా తీర్పు రిజర్వ్, వెల్లడి, అప్‌లోడ్‌ తేదీల వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచడానికి ప్రస్తుతం హైకోర్టులు అనుసరిస్తున్న విధానం ఏమిటో తెలపాలని చెప్పింది. ఈ సమాచారాన్ని బహిర్గతం చేయడం వల్ల ఏవైనా ఇబ్బందులు లేదా ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని భావిస్తే, ఆ వివరాలను కూడా తెలియజేయాలని చెప్పింది. నాలుగు వారాల్లోగా ఈ వివరాలపై అఫిడవిట్లు దాఖలు చేయాలనిరిజిస్ట్రార్ జనరల్స్‌కు సూచించింది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)