డేరాబాబాకు మరోసారి పెరోల్

Published on Mon, 01/05/2026 - 15:37

ఆధ్యాత్మిక గురువు, డేరా స్వచ్ఛ సౌధా ఛీప్ గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి పెరోల్ మంజూరయ్యింది. దీంతో ఆయన 40 రోజుల పాటు సాధారణ జీవితం గడపనున్నారు. ఈ పెరోల్ కాలంలో గుర్మిత్ బాబా సిర్సా హెడ్‌క్వార్టర్స్‌లో ఉండనున్నారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. 

గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు హర్యాణాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడే కాకుండా పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాలలో సైతం ఆయనకు భక్తులు ఉన్నారు. డేరాబాబా నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవ తదితర వాటి రీత్యా ఆయనపై ప్రజలకు అభిమానం అధికంగా ఉండేది. అయితే 2017లో ఆశ్రమానికి చెందిన ఇద్దరు మహిళలపై డేరాబాబా లైంగికదాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ అంశం విచారించిన కోర్టు ఆయనను దోషిగా తేలుస్తూ 20 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు అయ్యారు.

కాగా 2017లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకూ ఆయన దాదాపు 15సార్లు పెరోల్‌పై వచ్చారని నివేదికలు తెలుపుతున్నాయి. 2025లో జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు నెలలలో ,2024లో మూడు సార్లు ఫెరోల్‌పై బయిటకి వచ్చినట్లు పేర్కొన్నాయి. ఢిల్లీ, హర్యాణా, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు డేరాబాబా ఫెరోల్‌పై బయిటకు వచ్చారు. 2002లో జరిగిన జర్నలిస్టు హత్య కేసులో సైతం డేరాబాబా నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)