Breaking News

డిప్యూటీ కలెక్టర్‌కు తహసీల్దార్‌గా డిమోషన్‌

Published on Sat, 05/10/2025 - 06:04

సాక్షి, న్యూఢిల్లీ: తహసీల్దార్‌ హోదాలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి, గుంటూరు జిల్లాలో మురికివాడల నివాసితుల గుడిసెలను బలవంతంగా తొలగించిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన డిప్యూటీ కలెక్టర్‌ మోహనరావును తహసీల్దార్‌గా డిమోట్‌చేస్తూ  సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు  రూ.లక్ష  జరిమానా విధించి నాలుగు వారాల్లోగా జరిమానా చెల్లించా­లని ఆదేశించింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని నిర్ధారించి, 2 నెలల సాధారణ జైలు శిక్ష విధించిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వుకు వ్యతిరేకంగా డిప్యూటీ కలెక్టర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల  న్యాయమూర్తులు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. 

ఈ సందర్భంగా ‘చట్టం గొప్పతనం శిక్షించడంలో కాదు, క్షమించడంలో ఉంది’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.  2013 డిసెంబరు 11న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా 2014 జనవరిలో అప్పటి తహసీల్దార్‌గా ఉన్న మోహనరావు గుంటూ­రు జిల్లాలో గుడిసెలను బలవంతంగా తొలగించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి.. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు అధికారికి రెండు నెలల జైలు శిక్ష విధించారు.  

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. దీంతో డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును మోహనరావు ఆశ్రయించగా జస్టిస్‌ గవా­య్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. తాజాగా వాదో­పవాదాల అనంతరం మోహనరావు ఎటువంటి క్షమ­కు అర్హులు కానప్పటికీ, ఆయన పిల్లలు, కు­టుంబాన్ని బాధపెట్టరాదని భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. 

డిప్యూటీ కలెక్టర్‌ 2 నెలల జైలు శిక్ష అనుభవిస్తే, ఆయన తన ఉద్యోగం నుంచి వైదొలగాల్సి ఉన్నందున దయ చూపిస్తున్నామని,  డిప్యూ­టీ కలెక్టర్‌ నుంచి తహసీల్దార్‌గా డిమోట్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నట్టు వెల్లడించింది. డీమోట్‌ విషయంలో ఆయన వెనక్కి తగ్గకపోతే తిరిగి ఉద్యోగంలో నియమించకుండా చూస్తామని పేర్కొంది. దీంతో డిమోట్‌ విషయంలో మోహనరావును ఒప్పించడానికి న్యాయవాది సమయం కోరడంతో కేసు మళ్లీ వాయిదా పడింది. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)