Breaking News

పొగ మంచు ఎఫెక్ట్‌.. 255 విమానాలు ఆలస్యం, ఇద్దరు మృతి

Published on Sat, 01/04/2025 - 07:20

సాక్షి, విశాఖ: దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. పొగ మంచు ప్రభావంతో విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక, ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగిలో ఐదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.

ఏపీలో చలి పంజా కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో ఐదు డిగ్రీల కంటే కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఉదయం ఏడు గంటల వరకు పొగ మంచు ప్రభావం కొనసాగుతోంది. అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి, పార్వతీపురం మన్యం వంటి ప్రాంతాల్లో మరింత ఎక్కువగా చలి తీవ్రత ఉంది. రానున్న 10 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

మరోవైపు.. ఉత్తరాదిలో చలి కారణంగా దట్టమైన పొగమంచు అలుముకుంది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది.  విజిబిలీటీ తగ్గిపోయింది. దీంతో, ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఢిల్లీకి సంబంధించి 255 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదే సమయంలో 43 విమానాలను అధికారులు రద్దు చేశారు. 15 విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు.

ఇక, పొగ మంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం ఉదయం హర్యానాలో జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా ఇద్దరు మృతిచెందారు.

 

అలాగే, కోల్‌కత్తా విమానశ్రయంలో కూడా దట్టమైన పొగమంచు ఏర్పడింది. దీంతో, పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. చండీగఢ్, అమృత్‌సర్, జైపూర్, అనేక ఇతర విమానాశ్రయాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)