Breaking News

డెంగ్యూకు టీకా.. బీహార్‌లో తుది ట్రయల్స్‌

Published on Sun, 10/13/2024 - 13:04

పాట్నా: డెంగ్యూ వ్యాధి నుంచి ప్రజలకు త్వరలో విముక్తి లభించనుంది. బీహార్‌లోని పట్నాలో డెంగ్యూ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆరుగురికి డెంగ్యూ వ్యాక్సిన్‌ వేశారు. త్వరలో 500 మందికి ఈ వ్యాక్సిన్‌ను  ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిని రెండేళ్లపాటు శాస్త్రవేత్తల బృందం పరిశీలించనుంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన పాట్నాలోని రాజేంద్ర మెమోరియల్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తోంది. దేశంలోనే పూర్తిగా తయారవుతున్న ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్ సెప్టెంబర్ 26న ప్రారంభమైందని ఆర్‌ఎంఆర్‌ఐఎంఎస్ అధికారి ఒకరు తెలిపారు. ఐసీఎంఆర్‌, పనాసియా బయోటెక్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాయి.

వ్యాక్సిన్ పరీక్షల కోసం 10 వేల మందికి ముందుగా వ్యాక్సిన్‌ వేసి, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించనున్నారు. డెంగ్యూ వ్యాక్సిన్‌ను పరీక్షించేందుకు దేశవ్యాప్తంగా 19 కేంద్రాలను ఎంపిక చేశారు. వాటిలో ఆర్‌ఎంఆర్‌ఐఎంఎస్‌ ఒకటి. ఒక్కో కేంద్రంలో సుమారు 500 మందికి ట్రయల్ వ్యాక్సిన్ వేయనున్నారు. కాగా బీహార్‌లో డెంగ్యూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది 4,416 కేసులు నమోదయ్యాయి. 12 మంది డెంగ్యూ బాధితులు మృతిచెందారు. ఒక్క పట్నాలోనే 2,184 కేసులు నమోదయ్యాయి. 

ఇది కూడా చదవండి: బ్రెజిల్‌లో తుపాను బీభత్సం.. ఏడుగురు మృతి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)