Breaking News

విజృంభిస్తున్న డెంగ్యూ.. వచ్చే నెలలో మరింత వ్యాప్తి..

Published on Mon, 07/31/2023 - 19:43

ఢిల్లీ: దేశ రాజధానిలో డెంగ్యూ విజృంభిస్తోంది. ఒక్క జులై నెలలోనే దాదాపు 121 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఎడతెరిపిన లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇటీవల వరదలు సంభవించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వరదల కారణంగానే డెంగ్యూ వ్యాపిస్తోందని వైద్యులు తెలిపారు. ఆగష్టు నెలలో డెంగ్యూతో పాటు మలేరియా, చికన్ గున్యా వంటి ఇతర వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

ఈ ఏడాది ఆరంభం నుంచి జులై వరకు మొత్తం 243 డెంగ్యూ కేసులు నమోదైతే.. ఒక్క జులై నెలలోనే దాదాపు సగంపైనే కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు. ఇటీవల నగరంలో 72 మలేరియా కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. జులై చివరి వారంలోనే 34 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. జినోమ్ సీక్వెన్సింగ్‌కి 20 షాంపిల్స్ పంపించగా.. అందులో 19 కేసులు టైప్‌ 2 డెంగ్యూగా నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. 

డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 3 నుంచి 5 రోజుల వరకు జ్వరం తగ్గకపోవడం, శరీరంపై ఎర్రని చారలు, ప్లేట్‌లెట్స్ తగ్గడం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వెన్ను నొప్పులు ఉంటాయని వైద్యులు సూచించారు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. రానున్న వర్షాకాలం కావునా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.  

ఇదీ చదవండి: విద్యార్థిని వాటర్ బాటిల్‌లో మూత్రం కలిపి.. ప్రభుత్వ బడిలో దారుణం..

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)