Breaking News

దురదృష్టంగా భావించే సీటే ఇప్పుడు హాట్‌ కేకు

Published on Sun, 06/15/2025 - 06:29

11ఏ. ఎయిరిండియా విమాన ప్రమాదం తరువాత ఎక్కడ చూసినా ఈ సీట్‌ నంబర్‌ గురించిన చర్చే. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఏకైక ప్రయాణికుడు రమేశ్‌ కూచున్నది ఆ సీట్‌లోనే కావడం తెలిసిందే. సాధారణంగా 11ఏను దురదృష్టకరమైన నంబర్‌గా పిలుస్తారు. ఎందుకంటే అది ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ పక్కనే ఉంటుంది. బిజినెస్‌ క్లాస్‌ పూర్తవగానే మొదలయ్యే ఎకానమీ క్లాసులో ఉంటుంది గనుక ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ ఈ సీటు పక్కనే వస్తుంది. దాంతో 11ఏ సీటుకు కిటికీ ఉండదు. చాలామంది 
అందమైన మేఘాలను, భూమిపై బుల్లిగా కనిపించే ఊళ్లు, పట్టణాలను చూసే ఆసక్తితో విండో సీటే కోరుకుంటారు. ఆ అవకాశం ఉండదు గనుక 11ఏను ఎవరూ అంతగా ఇష్టపడరు. కానీ రమేశ్‌ విషయంలో ఈ దురదృష్టకరమైన సీటే ప్రాణదాతగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే సీటు ఊడిపోవడమే గాక పక్కనే ఉన్న ఎమర్జెన్సీ డోర్‌ విరిగిపోయింది. దాంతో వెంటనే కిందికి దిగి ప్రాణాలతో బయటపడ్డాడు.

అప్పుడూ 11ఏ సీటే
27 ఏళ్ల కిందట థాయ్‌ ఎయిర్‌వేస్‌ విమానం కూలిపోయినప్పుడు కూడా అచ్చు ఇలాగే జరిగింది. 1998 డిసెంబర్‌ 11న దక్షిణ థాయ్‌లాండ్‌లో ల్యాండయ్యే క్రమంలో అది చిత్తడి నేలల్లో పడిపోయింది. విమానంలోని 146 మందిలో 101 మంది మరణించారు. కానీ 11ఏ సీట్‌లో కూర్చున్న థాయ్‌ నటుడు–గాయకుడు రువాంగ్సాక్‌ లోయ్చుసాక్‌ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిరిండియా ప్రమాదంలోనూ సరిగ్గా అదే నంబర్‌ సీట్లో కూర్చున్న ప్రయాణికుడు క్షేమంగా బయట పడ్డట్టు తెలిసి ఎంతో ఆశ్చర్యపోయినట్టు చెప్పారాయన. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ‘‘నాకు రెండో జీవితం దక్కింది బహుశా 11ఏలో కూచోవడం వల్లేనేమో. నాటి బోర్డింగ్‌ పాస్‌ నా దగ్గర లేదు. కానీ నా సీట్‌ నంబర్‌ అప్పుడు పత్రికలన్నింట్లోనూ వచ్చింది. ఆ ప్రమాదం దెబ్బకు దశాబ్దం పాటు నేను విమాన ప్రయాణం చేయలేదు’’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టారు.

ఆ సీటుపై ఆసక్తి
ఎయిరిండియా విమాన ప్రమా దం తరువాత వాణిజ్య విమానాల్లో ఎమ ర్జెన్సీ ఎగ్జిట్‌ సీట్లపై ఆసక్తి పెరిగింది. 11ఏ సీట్‌నే బుక్‌ చేసుకోవాలను కుంటున్నట్టు చాలా మంది సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రమేశ్‌ ఉదంతంతో ఈ సీట్‌ చాలా సురక్షితమని భావిస్తున్నారు. కానీ అది నిజమనేందుకు ఎలాంటి సాంకేతిక ఆధారాలూ లేవు. ఒక్కో ప్రమాదం ఒక్కోలా జరుగుతుంది గనుక ఫలానా సీటు సురక్షితమని చెప్పలేమని అమెరికాకు చెందిన ఫ్లైట్‌ సేఫ్టీ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మిచెల్‌ ఫాక్స్‌ అన్నారు. విమానంలో ముందుకంటే వెనక వైపు సీట్లు ఎక్కువ సురక్షితమని 1971 నుంచి జరిగిన ప్రమాదాలపై 2007లో పాపులర్‌ మెకానిక్స్‌ చేసిన అధ్యయనంలో తేలింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)