Breaking News

దీపావళి మర్నాడే ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి.. 460కు ఏక్యూఐ!

Published on Mon, 11/09/2026 - 06:55

న్యూఢిల్లీ: దీపావళి మరుసటి రోజే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ను దట్టమైన కాలుష్యపూరిత పొగమంచు కమ్మేసింది. పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 400 దాటగా, జహంగీర్‌పురిలో అత్యధికంగా 460 నమోదైంది. ఐటీఓలో 406గా ఉంది. టపాసుల పొగ, వాహనాల ఉద్గారాలు, పంట వ్యర్థాల దహనం ఈ కాలుష్యానికి కారణమయ్యాయి.  దీపావళి వేడుకలు దేశ రాజధాని ఢిల్లీని కాలుష్య కోరల్లోకి నెట్టాయి. ఆదివారం రాత్రి ప్రజలు టపాసులు కాల్చడంతో గాలి నాణ్యత మరింత దిగజారింది. రాత్రి 7 గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ)371కి చేరింది. దీంతో గాలి నాణ్యత ‘వెరీ పూర్’ కేటగిరీలో నమోదైంది. నగరంలోని మొత్తం 59 కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల్లో 19 చోట్ల ఏక్యూఐ ‘సీవియర్’ స్థాయికి చేరింది. మరో ఏడు కేంద్రాల్లో ‘పూర్’, మిగిలిన 33 కేంద్రాల్లో ‘వెరీ పూర్’ స్థాయిలో నమోదైంది. జహంగీర్‌పురిలో అత్యధికంగా 460 ఏక్యూఐ నమోదైంది. ఆదివారం ఢిల్లీ సగటు ఏక్యూఐ 376గా నమోదైంది. శనివారం ఇది 369గా ఉండటం గమనార్హం. దీపావళి టపాసుల పొగతో పాటు వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, హర్యానా, పంజాబ్‌లో పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల సోమవారం పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అమల్లోకి గ్రాప్‌-3 ఆంక్షలు
శీతాకాలంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 6 నుంచి ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్‌) మూడో దశను అమల్లోకి తెచ్చింది. ఏక్యూఐ 401-500 మధ్య నమోదైనప్పుడు ఈ దశను అమలు చేస్తారు. ఇందులో భాగంగా నిర్మాణ, కూల్చివేత పనులపై నిషేధం విధించారు. బీఎస్‌-3 పెట్రోల్, బీఎస్‌-4 డీజిల్ నాలుగు చక్రాల వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు.

అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు రావాలని, మిగిలిన వారు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించారు. నవంబర్ 1 నుంచే వాహనాల ప్రవేశం, నిర్మాణ పనులపై కొన్ని నిబంధనలు అమల్లోకి రాగా.. గ్రాప్‌-3తో ఆంక్షలు మరింత కఠినతరమయ్యాయి. కాలుష్యం మరింత పెరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)