Breaking News

ఢిల్లీలో భారీ వర్షాలు.. కరెంటు షాక్ కొట్టడంతో యువతి మృతి 

Published on Sun, 06/25/2023 - 15:18

న్యూఢిల్లీ: ఢిల్లీలో రుతుపవనాల తాకిడికి శనివారం జోరుగా వర్షం కురిసిన వర్షాలు ఒక యువతిని బలితీసుకున్నాయి. గుంతలుగా మారిన రోడ్డులో నడుస్తూ పొరపాటున కరెంటు స్తంభానికి వేలాడుతున్న వైర్లను తాకడంతో తాకడంతో యువతి విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఆమె అప్పటికే చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు నిర్ధారించాయి.     

తూర్పు ఢిల్లీలోని ప్రీతి విహార్ లో నివాసముండే సాక్షి అహూజా తెల్లవారుజాము 5.30 నిముషాలకు ఇద్దరు పెద్దవాళ్ళు ముగ్గురు చిన్నారులతో రైల్వే స్టేషన్ వైపుగా వెళ్తోంది. రోడ్డంతా గుంతలు ఏర్పడటంతో వాటిని తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న కరెంటు స్థంభంవైపు అడుగు వేసిన ఆ యువతికి కింద వేలాడుతున్న వైర్లు తాకి అక్కడికక్కడే కూలబడిపోయింది. 

అక్కడే ఉన్న ఆమె సోదరి మాధవి చోప్రా వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే సాక్షి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఆమె సోదరి మరణించినట్లు సంబంధిత అధికారులపై మాధవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి లోకేష్ కుమార్ చోప్రా కూడా అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  

విపరీతమైన ఉక్కపోతతో వేసవిపై విసుగెత్తిపోయిన తరుణంలో తొలకరి చినుకులు ఎట్టకేలకు పలకరించాయని సంతోషించేంతలోపే ఢిల్లీలో పెనువిషాదం చోటు చేసుకోవడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురైయ్యారు. 

ఇది కూడా చదవండి: ఆ చీకటి రోజులను మరచిపోలేము.. ప్రధాని మోదీ

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి