Breaking News

ప్రాణం తీసిన కొత్త ఫోను సంబురం

Published on Wed, 09/25/2024 - 09:42

న్యూఢిల్లీ: కొత్త ఫోన్‌ కొన్న స్నేహితుడి నుంచి చిన్న పార్టీ ఆశించి భంగపడిన తోటి స్నేహితులు అతడిని దారుణంగా పొడిచి చంపిన విషాద ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. నిందితులు ముగ్గురు 9వ తరగతి చదివే 16 ఏళ్ల టీనేజర్లు కావడం గమనార్హం. తూర్పు ఢిల్లీ పరిధిలోని షకర్‌పుర్‌ ప్రాంతం రాంజీ సమోసా దుకాణం దగ్గర అందరూ చూస్తుండగానే ఈ హత్య జరిగింది. 

మంగళవారం ఢిల్లీ డెప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(ఈస్ట్‌) అపూర్వ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి సచిన్‌ అనే 16 ఏళ్ల టీనేజర్‌ ఫోన్‌ కొనేందుకు స్నేహితుడిని వెంట తీసుకెళ్లాడు. వారికి మరో ముగ్గురు స్నేహితులను కలుపుకున్నారు. కొత్త ఫోన్‌ చూశాక స్నేహితులంతా పార్టీ ఇవ్వాల్సిందేనని సచిన్‌పై ఒత్తిడి తెచ్చారు. 

అందుకు సచిన్‌ ససేమిరా అన్నాడు. దీంతో మాటామాటా పెరిగింది.  స్నేహితుల్లో ఒకడు సచిన్‌ను వెనుక నుంచి కత్తితో రెండుసార్లు పొడిచి హత్యచేశాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ హత్యోదంతం చోటుచేసుకుంది. రక్తమోడుతున్న సచిన్‌ ఆస్పత్రిలో చనిపోయాడు. ఘటనా స్థలి మీదుగా వెళ్తున్న పోలీస్‌ పెట్రోలింగ్‌ బృందం రోడ్డుపై ఉన్న రక్తపు మరకలను చూసి ఆగి ఆరా తీశారు. స్థానికంగా ఉండే ఆ ముగ్గురు టీనేజర్లను అరెస్ట్‌చేశారు. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 103(1), 3(5) సెక్షన్లకింద కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలెట్టారు. ఘటనాస్థలిలో హత్యకు ఉపయోగించిన కత్తిని స్వా«దీనం చేసుకున్నారు.    

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)