Breaking News

‘‘అబ్బో వందేభారత్‌లు.. ఎవరి కోసమండీ?’’

Published on Tue, 06/27/2023 - 07:24

ఢిల్లీ: కోట్లు ఖర్చు చేసి వందేభారత్‌ రైళ్లను ప్రారంభిస్తూ.. ఘనంగా చాటింపు వేసుకుంటారు. కానీ, సాధారణ ప్రయాణికులు తిరిగే రైల్వే స్టేషన్‌లలోనే కనీస వసతులు ఉండవు. ఐదు లక్షల మందికి కనీసం ఒక ఆంబులెన్స్‌ ఉండదా?.. ఏదైనా జరిగి ప్రాణం పోయినప్పుడు డబ్బులిస్తే సరిపోతుందా?. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారకులకు శిక్ష పడాల్సిన అవసరం ఉండదా?.. ఇదెక్కడి న్యాయం?.. ఢిల్లీకి చెందిన లోకేష్‌ కుమార్‌ చోప్రా ఆవేదన ఇది..

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆదివారం సాక్షి ఆహూజా(34) అనే మహిళ కరెంట్‌ షాక్‌తో ప్రాణం కోల్పోయింది. అంతా చూస్తుండగానే విద్యుత్‌ ఘాతానికి గురైన ఆమెకు చికిత్స అందించడానికి అక్కడ ఒక్క డాక్టర్‌ కూడా అందుబాటులో లేరు. సమయానికి కరెంట్‌ ఆఫ్‌ చేసి ఆమెను రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పైగా చికిత్స కోసం దాదాపు 40 నిమిషాల తర్వాత ఆంబులెన్స్‌ అందుబాటులోకి వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసింది. 

► దేశ రాజధానిలో నిత్యం కనీసం ఐదు లక్షల మంది తిరిగే ఆ రైల్వే స్టేషన్‌లో డాక్టర్లు, ఆంబులెన్స్‌ల మాటెరుగు.. కనీసం ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ కూడా లేదంట!. 

► హైక్వాలిటీ రైళ్లంటూ కోట్లు ఖర్చుచేసి వందేభారత్‌ రైళ్లను తయారు చేసి గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ, లక్షల మంది తిరిగే స్టేషన్‌లలో కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది మాత్రం చూడం!. అంతా చూస్తుండగానే.. నా కూతురి ప్రాణం పోయింది. ఘటనపై చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు మాకు చెప్పారు. కానీ, ఇంతవరకు ఏదీ ముందుకు జరగలేదు. ప్రభుత్వాలు జనాలకు కొత్తగా ఏం అక్కర్లేదు..  ఉన్నంతలో సౌకర్యాలను ప్రజలకు మెరుగ్గా అందిస్తే సరిపోతుంది కదా?. గొప్పలను మాత్రమే మీడియాలో ఎందుకు చూపించుకుంటారు? ఇలాంటి వాటి విషయంలోనూ స్పందించాలి కదా అని ప్రభుత్వాల్ని ఆ తండ్రి ఆవేదనభరితంగా నిలదీస్తున్నారు.

► బాధితురాలి తండ్రిగా డబ్బు అందుకునేందుకు నేను సిద్ధంగా లేను. నాకు కావాల్సింది న్యాయం. దీనికి కారకులను కఠినంగా శిక్షించాలి అంతే.. అని లోకేష్‌ చోప్రా డిమాండ్‌ చేస్తున్నారు. 

► ఢిల్లీ  రైల్వేస్టేషన్‌లో గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగిందట. దానిపై ఫిర్యాదులు వెళ్లినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని అక్కడ పని చేసే కూలీలు చెబుతున్నారు. 

► ఈస్ట్‌ ఢిల్లీ ప్రీత్‌ విహార్‌లో టీచర్‌గా పని చేస్తున్న సాక్షి అహూజా తన పిల్లలు, సోదరి కుటుంబంతో కలిసి ఛండీగఢ్‌ వెళ్లే క్రమంలో ఆదివారం వేకువఝామున ఢిల్లీ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే.. స్టేషన్‌ ఎగ్జిట్‌ వద్ద నిలిచిన నీటి గుంత నుంచి తప్పుకునే క్రమంలో ఆమె అక్కడే ఉ‍న్న ఓ పోల్‌ను తాకారు. అయితే అప్పటికే అక్కడ తెగిపడి ఉన్న వైర్లు ఆమెను లాగేసి.. విద్యుత్‌ ఘాతంతో ఆమె విలవిలలాడిపోయారరు. ఆ సమయంలో ఆమె ఇద్దరు పిల్లలూ ఆమె కూడా ఉండగా.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. 

► ఆమె సోదరి, అప్పటికే లగేజ్‌ తీసుకుని లోపలికి వచ్చిన ఆమె తండ్రి.. ఆ దృశ్యాలను చూసి సాయం కోసం కేకలు వేశారు. కరెంట్‌ షాక్‌తో కొన్ని నిమిషాలు విలవిలలాడిపోయి ఆమె కిందపడిపోయారు.  దాదాపు 30-40 నిమిషాలపాటు ఆమె అలాగే స్పృహ లేకుండా పడి ఉండిపోగా.. అప్పుడు ఆంబులెన్స​ వచ్చి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే.. మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసింది. 

ఈ ఘటనపై భారతీయ రైల్వేస్‌ విచారం వ్యక్తం చేసింది. ఘటనపై దర్యాప్తునకు ఓ కమిటీ నియమిస్తున్నట్లు తెలిపింది. ఇక ఘటన సమయంలో ఆమె సోదరి మాధవి కూడా వెంట ఉండగా.. వెంటనే ఆమె విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు సైతం నమోదు అయ్యింది.  సాక్షి మరణం తర్వాత ఢిల్లీ అధికారులు అక్కడి కరెంట్‌ పోల్స్‌కు మరమ్మత్తులు చేపడుతుండడం గమనార్హం.

Video Credits: Times Now Navbharat

ఇదీ చదవండి: భార్యను చదివించిన భర్త.. ఆమె మాత్రం మరో వ్యక్తితో..

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)