Breaking News

Delhi: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..!

Published on Mon, 05/29/2023 - 14:57

దేశ రాజధానిలో దారుణ ఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే 16 ఏళ్ల బాలికను ఓ యువకుడు(20) విచక్షణా రహితంగా కత్తితో దాడిచేశాడు. బాలికపై 20సార్లు  కత్తితో పొడిచాడు. అంతటితో ఆగకుండా పెద్ద బండరాయితో బాలిక తలపై పలుసార్లు మోదాడు. ఇంత ఘోరం జరుగుతున్న నిందితున్ని ఒక్కరు కూడా నిలువరించకపోవడం గమనార్హం.ఈ వ్యవహారం మొత్తం అక్కడి సీసీటీవీల్లో (CCTV) రికార్డు అయ్యింది.

వివరాలు.. ఢిల్లీ, రోహిణి ప్రాంతంలోని షహబాద్‍లో 16 ఏళ్ల బాలిక నివసిస్తోంది. సాహిల్‌ అనే 20 ఏళ్ల యువకుడితో  బాలిక స్నేహంగా ఉంటోంది. ఇటీవల వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆదివారం తన స్నేహితురాలి కుమారుని పుట్టినరోజు వేడుకలకు వెళ్లడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో ఆమెను అడ్డగించిన నిందితుడు.. బాలికపై కత్తితో అత్యంత పాశవికంగా దాడి చేశాడు. ఏకంగా 20 సార్లు కత్తితో పొడిచాడు.

ఒకనొక దశలో బాధితురాలి తలలో కత్తి ఇరుక్కుపోయేంత విచక్షణా రహితంగా దాడి చేశాడు.  అంతటితో అగకుండా బండరాయితో మోదాడు. ఇంత ఘోరం జరుగుతున్నా చుట్టుపక్కల వాళ్లు నిందితున్ని ఆపే ప్రయత్నం చేయలేదు. అనంతరం ఘటనా స్థలం నుంచి నిందితుడు పారిపోయాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. నిందితున్ని సాయిల్‌గా గుర్తించారు. అయితే.. బాధితురాలు, సాయిల్ ప్రేమించుకున్నారని సమాచారం. అమ్మాయి అతనితో గొడవపడిన అనంతరం నిందితుడు ఇంతటి ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 18 గంటల అనంతరం నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు.

నిందితునికి తగిన శిక్ష విధించాలని బాధితురాలి తల్లి కోరింది. మహిళలను రక్షించలేనప్పుడు ఆ పదవి ఎందుకని లెఫ్టినెంట్ గవర్నర్‍ను విమర్శించారు ఆప్ నేత అతిషి మర్లెన. తమ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. ఈ ఘటనపై ఆప్ ప్రభుత్వాన్ని ఢిల్లీ బీజేపీ చీఫ్ విమర్శించారు. ఇదో లవ్ జివాద్ కేసని అన్నారు.

ఇదీ చదవండి:బంగారం గొలుసు కొట్టేసి.. కాపాడమని పోలీసులను వేడుకున్న దొంగ!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)