Breaking News

ఢిల్లీలో జనం ఉక్కిరిబిక్కిరి

Published on Mon, 11/06/2023 - 05:12

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. వాయు నాణ్యత పడిపోతోంది. వరుసగా ఆరో రోజు ఆదివారం సైతం పొగ మంచు దట్టంగా కమ్మేసింది. నగరంలో కాలుష్యం మరోసారి ‘అత్యంత తీవ్రం’ కేటగిరీలోకి చేరింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) శనివారం సాయంత్రం 4 గంటలకు 415 ఉండగా, ఆదివారం ఉదయం 7 గంటలకు 460గా దిగజారింది. కలుíÙత గాలితో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలకు సెలవులను ప్రభుత్వం మరో ఐదు రోజులపాటు పొడిగించింది. ఈ నెల 10వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లు తెరిచే ఉంటాయని పేర్కొంది. విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు కూడా వినవచ్చని ఢిల్లీ విద్యా శాఖ మంత్రి సూచించారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండడం, పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాలను దహనం చేస్తుండడంతో ఢిల్లీలో వాయు నాణ్యత పడిపోతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల రాజధానుల కంటే ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత దారుణంగా ఉన్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది.  

వాణిజ్య వాహనాలకు నో ఎంట్రీ
ఢిల్లీలో వాయు నాణ్యత నానాటికీ పడిపోతుండడం, కాలుష్యం పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిర్మాణ పనులపై నిషేధం విధిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కాలుష్యానికి కారణమయ్యే రవాణా వాహనాలు, వాణిజ్య వాహనాల ప్రవేశాన్ని నిషేధించింది.

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)