Breaking News

ఢిల్లీలో 23 స్కూళ్లకు బాంబు బెదిరింపు.. పోలీసులకు చిక్కిన విద్యార్థి

Published on Fri, 01/10/2025 - 11:00

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులకు సంబంధించి క్లాస్‌ 12 విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలలో పరీక్ష జరగకూడదనే కారణంగానే అతడు బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు తేల్చారు. బాంబు బెదిరింపులకు సంబంధించి సదరు విద్యార్థే ఆరు సార్లు మెయిల్స్‌ పంపినట్టు గుర్తించారు.

ఇటీవలి కాలంలో ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్‌, మెయిల్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. బాంబు బెదిరింపులు రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం తనిఖీలు చేసింది. ఈ నేపథ్యంలో బెదిరింపు మెయిల్స్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఓ పాఠశాలకు చెందిన 12వ తరగతి విద్యార్థినే పలుమార్లు బెదిరింపులకు కారణమని గుర్తించారు. దీంతో, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పాఠశాలలో పరీక్ష జరగకూడదనే అతడు బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు తేల్చారు. ఈ విద్యార్థే ఆరుసార్లు బాంబు బెదిరింపు మెయిల్స్‌ పంపినట్టు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. సదరు బాలుడు ఎంతో ప్లాన్‌ ప్రకారం ఇలా చేసినట్టు తెలుస్తోంది. ప్రతిసారీ అతడు.. తన సొంత పాఠశాలలను కాకుండా వేరే పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్‌ పంపించాడు. అనుమానం రాకుండా ఉండటానికి ఇలా చేసినట్టు అధికారులు వెల్లడించారు. అతను ఒకసారి 23 పాఠశాలలకు మెయిల్ పంపాడని అధికారులు తెలిపారు.

మరోవైపు.. బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయం సైతం వేడెక్కింది. శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి అతిషి.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను విమర్శించడంతో బాంబు బెదిరింపులు రాజకీయ వివాదానికి దారితీశాయి. ఈ క్రమంలో ఆప్‌, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.

ఢిల్లీలో 23 స్కూళ్లకు బాంబు బెదిరింపు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)