Breaking News

ఛాతీలో కత్తితో పోలీస్‌ స్టేషన్‌కు బాలుడు

Published on Sun, 09/07/2025 - 08:10

న్యూఢిల్లీ: పదిహేనేళ్ల ఓ బాలుడిపై కొందరు కత్తితో దాడి చేశారు. ఛాతీలో దిగబడిన కత్తితో రక్తమోడుతూనే అతడు పోలీస్‌ ఠాణాకు చేరుకున్నాడు. వెంటనే పోలీసులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి, ఛాతీలో దిగి ఉన్న కత్తిని విజయవంతంగా తొలగించి, బాలుడి ప్రాణాలు కాపాడారు. విచారణ జరిపిన పోలీసులు నిందితులైన ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన ఢిల్లీలోని పహార్‌గంజ్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 సుమారు 15 రోజుల క్రితం నిందితుల్లో ఒకరిని కొందరు బాలురు కొట్టారు. దీని వెనుక ఉన్నది బాధిత బాలుడేనని నిందితుల అనుమానం. ఇదే కారణంతో ఆ బాలుడిని స్కూలు వద్ద ముగ్గురూ అడ్డుకున్నారు. పగిలిన బీర్‌ బాటిల్‌తో పొడుస్తానంటూ ఒకడు బెదిరించగా, అదే సమయంలో మరొకడు కత్తితో ఛాతీపై పొడిచాడు. ఆ వెంటనే బాలుడు పహార్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు రాగా, పోలీసులు కేసు నమోదు చేశారు. మరికొన్ని గంటల్లో ఆరాంబాగ్‌ ప్రాంతంలో ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు వాడిని కత్తిని, పగిలిన బాటిల్‌ను స్వా«దీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)