Breaking News

ఢిల్లీలో కుండపోత వర్షం.. నీటి మునిగిన కార్లు, బస్సులు

Published on Sun, 05/25/2025 - 11:47

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కారణంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మరోవైపు.. ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీలో ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు అధికారులు.

వివరాల ప్రకారం.. ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. పలు కాలనీల్లో చెట్లు విరిగిపోయి పడిపోవడంతో కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. వర్షం కారణంగా చాలా రోడ్లు, అండర్‌పాస్‌లు నీటితో నిండిపోయాయి. ఇక, వాతావరణం అనుకూలంగా లేని కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 200 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరో 49 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాల సమయాలను సంబంధిత వెబ్‌సైట్లలో చెక్‌ చేసుకోవాలని సూచించింది. ఎయిర్‌ ఇండియా, ఇండిగో కూడా ప్రయాణికులకు అలర్ట్‌లు పంపించాయి.

ఇదిలా ఉండగా.. శనివారం అర్థరాత్రి కురిసిన వర్షానికి ఢిల్లీ నగరాన్ని విమానాశ్రయానికి కలిపే అండర్‌ పాస్‌ రోడ్డుపై భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో, డజన్ల కొద్దీ కార్లు, బస్సులు నీటమునిగాయి. రానున్న కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షం కారణంగా ఇప్పటికే ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)