Breaking News

ఆపరేషన్‌ ఆఘాత్‌ 3.0 

Published on Sun, 12/28/2025 - 05:50

న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ ఢిల్లీ పోలీసులు నేరగాళ్లపై ఉక్కుపాదం మోపారు. శుక్రవారం వాయవ్య ఢిల్లీలో ‘ఆపరేషన్‌ ఆఘాత్‌ 3.0’పేరుతో చేపట్టిన దాడుల్లో భారీ సంఖ్యలో ఆయుధాలు, మాదకద్రవ్యాలు, మద్యంతోపాటు వాహనాలు పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా పలు నేరారోపణలపై 966 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

కొత్త సంవత్సర వేడుకల సమయంలో నివాస ప్రాంతాలు, మురికివాడల్లో నేరాలకు పాల్పడే వారిని, వీధి ఘర్షణలను అదుపు చేసేందుకే ఈ ఆపరేషన్‌ చేపట్టామన్నారు. ఆపరేషన్‌ ఆఘాత్‌ 3.0 సమయంలో 21 దేశవాళీ పిస్టళ్లు, 20 తూటాలు, 27 కత్తులను ఆయుధాల చట్టం కింద స్వా«దీనం చేసుకున్నామని వివరించారు. 12,258 క్వార్టర్ల అక్రమ మద్యం, 6కిలోల గంజాయితోపాటు రూ.2.36 లక్షల నగదును గ్యాంబ్లర్స్‌ నుంచి సీజ్‌ చేసినట్లు చెప్పారు.

 మొత్తం 310 సెల్‌ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు, ఒక కారును  పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో 600 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారన్నారు. నేరాలకు పాల్పడినట్లు తేలితే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 11, 112 కింద కేసులు నమోదు చేసి బహిష్కరణ దండన వంటి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)