Breaking News

గ్యాంగ్‌స్టర్ల స్థావరాలపై ఢిల్లీ పోలీసుల దాడులు

Published on Wed, 11/13/2024 - 11:03

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ల అరాచకాలను అరికట్టేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, కౌశల్ చౌదరి గ్యాంగ్, హిమాన్షు భావు గ్యాంగ్, కాలా జాతేడి, హషీమ్ బాబా, చేను గ్యాంగ్, గోగి గ్యాంగ్, నీరజ్ బవానియా, టిల్లూ తాజ్‌పురియా గ్యాంగ్‌లతో సంబంధమున్న వాంటెడ్ నేరస్థుల రహస్య స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు.

ఢిల్లీలోని ఔటర్ ఢిల్లీ, ద్వారకా ఏరియా, ఈశాన్య ఢిల్లీ, నరేలా, కంఝవాలా, సంగమ్ విహార్ తదితర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసు బృందాలు దాడులు నిర్వహించాయి. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ బృందం, ప్రత్యేక పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టాయి.  గ్యాంగ్‌స్టర్లతో సంబంధం ఉన్న పలువురు షూటర్లు, హెంచ్‌మెన్‌లను అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీలోని గ్యాంగ్‌స్టర్లు  ఇటీవలి కాలంలో తమ అనుచరుల ద్వారా కాల్పులు, హత్యా ఘటనలకు పాల్పడుతున్నారు. 2024 అక్టోబరులో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన ఏడుగురు షూటర్లను అరెస్టు చేసింది. వీరిని పంజాబ్, ఆ చుట్టుపక్కల రాష్ట్రాలలో అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

బాబా సిద్ధిఖీ కేసులో అరెస్టయిన షూటర్లను స్పెషల్ సెల్ విచారిస్తోంది. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. 2022లో నమోదైన రెండు ఎన్‌ఐఏ కేసుల్లో అతనిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. 

ఇది కూడా చదవండి: ‘నేటి పిల్లలే రేపటి సూపర్‌ మోడల్స్‌’.. 200 మంది పేరెంట్స్‌కు రూ. 5 కోట్ల టోకరా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)