Breaking News

‘రోజ్‌గార్‌ మేళా’లో పాల్గొననున్న ప్రధాని మోదీ

Published on Mon, 12/23/2024 - 09:34

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు(సోమవారం) యువతకు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వర్చువల్‌గా జరిగే ‘రోజ్‌గార్‌ మేళా’లో ప్రధాని పాల్గొని యువతతో ఆయన సంభాషించనున్నారు.

కేంద్ర ప్రభుత్వంలోని పలుశాఖల్లోని విభాగాలలో పలు ఉద్యోగాలకు ఎంపికైన 71 వేల మంది యువతీయువకులకు ప్రధాని మోదీ నియామక పత్రాలను అందజేయనున్నారు. ‘రోజ్‌గార్‌ మేళా’లో భాగంగా  కార్యక్రమం జరగనుంది. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం ఆయా రాష్ట్రాల్లోని  కేంద్ర మంత్రులు అభ్యర్థులకు నియామక పత్రాలను స్వయంగా అందజేయనున్నారు.

హోమ్‌శాఖ, తపాలా విభాగం, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం తదితర శాఖల్లో 71 వేల ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటనలో వివరించింది. రోజ్‌గార్ మేళా కార్యక్రమాన్ని ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం. ఇది జాతి నిర్మాణంతో పాటు స్వయం ఉపాధిలో యువత భాగస్వామ్యానికి  అవకాశాలను కల్పిస్తుంది. రాష్ట్రస్థాయిల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ రోజ్‌గార్ మేళాలను నిర్వహిస్తుంటాయి. దేశంలో యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఉపాధి మార్గాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రోజ్‌గార్‌ మేళాను నిర్వహిస్తుంటారు. 

ఇది కూడా చదవండి: ఇంకా ఆందోళనకరంగానే పరిస్థితి!

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)