Breaking News

Delhi Pollution: కమ్మేసిన పొగమంచు.. ప్రమాదస్థాయిలో కాలుష్యం

Published on Wed, 11/13/2024 - 07:11

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈరోజు(బుధవారం) ఉదయం 5 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 339గా నమోదైంది. దీనికితోడు చలి వాతావరణం నెలకొంది. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో పొగమంచు కారణంగా విజిబులిటీ తగ్గింది.

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత నిరంతరం క్షీణిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం దేశ రాజధానిలో గాలి నాణ్యత బుధవారం కూడా ‘చాలా పేలవమైన’ కేటగిరీలో  ఉంది. గాలి నాణ్యత 301 నుండి 400 మధ్య ఉన్నప్పుడు జనం శ్వాసకోశ వ్యాధులకు లోనవుతారు. ఇదేవిధంగా ఏక్యూఐ 401 నుండి 500 మధ్య ఉన్నప్పుడు తీవ్రమైన కాలుష్యం  కమ్మేసినట్లు పరిగణిస్తారు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే పలు వ్యాధులతో బాధపడుతున్న వారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో మంగళవారం ఉదయం 7:30 గంటలకు సగటు గాలి నాణ్యత సూచిక 355గా నమోదైంది. ఇది చాలా పేలవమైన కేటగిరీలోకి వస్తుంది. సోమవారం ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచీ 347గా ​​నమోదైంది. ఇదిలావుండగా ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఢిల్లీ సెక్రటేరియట్‌లో నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు  హీటర్లను పంపిణీ చేశారు. చలి మంటలను వేస్తే కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఢిల్లీ ప్రభుత్వం హీటర్లను పంపిణీ చేసిదని తెలిపారు. 

Delhi: ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న వాయు కాలుష్యం

ఇది కూడా చదవండి: రాష్ట్రంలో రిలయన్స్‌ ఎనర్జీ బయోగ్యాస్‌ ప్లాంట్లు

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)