Breaking News

పొగబారిన ఉత్తరాది.. 50 రైళ్లు, పలు విమానాలపై ప్రభావం

Published on Fri, 11/15/2024 - 11:29

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతదేశమంతా గత రెండు రోజులుగా తెల్లటి పొగమంచు కింద తలదాచుకుంటోంది. ఈరోజు (శుక్రవారం) మూడో రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పెరిగిన చలికి తోడు పొగమంచు కారణంగా పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది.  

పొగమంచు దట్టంగా అలముకోవడంతో రవాణా సమస్య తీవ్రమయ్యింది. ఉత్తర భారతదేశంలోని పలు నగరాల్లో పొగమంచు  కారణంగా ఉదయం 9 గంటలకు వరకూ కూడా విజిబులిటీ సరిగ్గా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రైళ్లు, విమానాలపై కూడా పొగమంచు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ రోజు కూడా అమృత్‌సర్, చండీగఢ్, ఢిల్లీల నుండి  పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రన్‌వేపై చాలా తక్కువ విజిబులిటీ కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం  పడుతోంది. పొగమంచు కారణంగా లక్నో, చండీగఢ్‌లకు వచ్చే విమానాలను జైపూర్‌కు మళ్లించారు.

ఇక రైళ్ల విషయానికొస్తే ఢిల్లీలోని వివిధ స్టేషన్లలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీకి వచ్చే 30కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని 50కి పైగా రైళ్లపై పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. న్యూఢిల్లీకి వచ్చే 30కి పైగా రైళ్లు, ఆనంద్ విహార్‌కు వచ్చే 10 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎన్‌సీఆర్‌లోని 50కి పైగా రైళ్లపై పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. ఈ రైళ్లన్నీ చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఇది కూడా చదవండి: Delhi Pollution: గ్యాస్‌ ఛాంబర్‌ కన్నా ఘోరం.. బ్రెయిన్‌ స్ట్రోక్‌ ముప్పు!

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)