Breaking News

Delhi: విద్యార్థులకు మెట్రో శుభవార్త

Published on Sat, 02/15/2025 - 11:02

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ బోర్టు పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఢిల్లీ మెట్రో శుభవార్త తెలిపింది. ఈరోజు (ఫిబ్రవరి 15)నుంచి సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఢిల్లీ మెట్రో ప్రత్యేక వెసులుబాటు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అడ్మిట్‌ కార్డులను మెట్రో స్టేషన్‌ సిబ్బందికి చూపించాలని తెలియజేసింది.

ఢిల్లీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) తెలిపిన వివరాల ప్రకారం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు టికెట్ ఆఫీస్ మెషీన్స్ (టీఓఎం), కస్టమర్ కేర్ (సీసీ) కేంద్రాలలో టిక్కెట్లు కొనుగోలు చేసేటప్పుడు వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపింది. రద్దీ సమయంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవడానికి వీలుగా వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఢిల్లీ మెట్రో పేర్కొంది.

ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగే పరీక్షలకు ఢిల్లీకి చెందిన 3.30 లక్షల మంది విద్యార్థులు  హాజరవుతున్నారు. వీరి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఢిల్లీ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది.  ఇదేవిధంగా పరీక్షలు జరిగే రోజుల్లో రద్దీని నియంత్రించేందుకు మెట్రో స్టేషన్లలో సీఐఎస్‌ఎఫ్‌ సహకారంతో ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఢిల్లీ మెట్రో తెలిపింది.

ఇది కూడా చదవండి: Mahakumbh: 1,100 కి.మీ పరుగు.. కుంభమేళాకు అగ్నివీర్‌

 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు