Breaking News

ఆసుపత్రుల్లో ఎలా దోచుకుంటున్నారో ఈ ఘటనే నిదర్శనం

Published on Sun, 08/02/2026 - 15:29

న్యూఢిల్లీ: ప్రైవేటు ఆసుపత్రులు వేసే బిల్లులకు భయపడి చాలా మంది వాటిల్లో చేరాలంటేనే దడుచుకుంటారు. కేవలం చికిత్సకు మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాల బిల్లులు వేస్తుంటాయి ఆసుపత్రులు. ఓ వ్యక్తి తనకు ఆసుపత్రిలో ఎదురైన ఇటువంటి అనుభవం గురించి చెప్పాడు. ఇప్పటికే వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తికి ఆసుపత్రి ప్రాంగణంలోని రెస్టారెంట్‌లో తక్కువ తిన్నప్పటికీ రూ.700కు పైగా బిల్లు రావడంతో షాక్‌కు గురయ్యాడు.

సంతోష్ భారత్‌వంశీ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన గురించి వివరించాడు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి ఓ కారణంతో వెళ్లినట్లు తెలిపాడు. ఆకలిగా అనిపించడంతో ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉన్న ప్రముఖ ఆహార సంస్థ అవుట్‌లెట్‌లో అల్పాహారం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే భోజనం ముగిసిన తర్వాత అతడికి రూ.708 బిల్లు వచ్చింది. తాను కేవలం 3 వస్తువులు మాత్రమే ఆర్డర్ చేయడంతో ఆ బిల్లు చూసి ఆశ్చర్యపోయాడు. అవి మసాలా దోశ, ఓ కప్పు టీ, మజ్జిగ. మసాలా దోశ ధర రూ.274, టీ ధర రూ.74, మజ్జిగ ధర రూ.85 అని తెలిపాడు.

“అల్పాహారం కోసం 2 మసాలా దోశలు, ఒక టీ, ఒక మజ్జిగ ఆర్డర్ చేశాం. బిల్లు రూ.708 వచ్చింది. అది చూసిన వెంటనే నా తల తిరిగిపోయింది. ఒక మసాలా దోశ ధర రూ.274. 200 మిల్లీలీటర్ల మజ్జిగ బాటిల్ ధర రూ.85. ఒక టీ ధర రూ.74.

ఆసుపత్రిలో అడుగుపెట్టిన క్షణం నుంచే రోగి మందులు, డాక్టర్ ఫీజులు, ఆసుపత్రి ఖర్చులతో రోగి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తుంటారు.  దీనికి తోడు ఆహారం, పానీయాల విషయంలో ఇలా దోచుకోవడం.. రూ.74 టీ, రూ.20 విలువ చేసే మజ్జిగకు రూ.85 వసూలు చేయడం చాలా ఎక్కువైంది” అని అతడు తన పోస్టులో పేర్కొన్నాడు. ఆ తర్వాత ప్రముఖ ఆహార సంస్థ యజమానుల మానవత్వంపై అతడు ప్రశ్నలు లేవనెత్తాడు.

“వారి యజమానుల్లో కనీస మానవత్వం కూడా మిగల్లేదా? బయట ఎక్కడైనా ప్రజల నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నా, కనీసం ఆసుపత్రుల వంటి ప్రదేశాల్లో అయినా ఈ బహిరంగ దోపిడీని ఆపండి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బయట అల్పాహార ఆర్డర్లపై 30%-40% తగ్గింపు ఉంటుంది. కానీ ఆసుపత్రి లోపల ఎలాంటి ఆఫర్లు లేవు.. నేరుగా దోపిడీ మాత్రమే” అని పోస్టులో పేర్కొన్నాడు.

ఈ పోస్టు వైరల్ కావడంతో చాలా మంది స్పందించారు. ఎక్కువ మంది ఈ వ్యక్తి సమస్య తమకు కూడా ఎదురైనట్లు తెలిపారు. ఈ పోస్టును ఎక్స్‌లో ‘ఎస్‌కేవై జర్నో’ అనే ఖాతాలో షేర్ చేశారు. 

 

#

Tags : 1

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)