Breaking News

తల్లిపై ‘అనుమానం’తో రెండుసార్లు అకృత్యం.. చేసిన పనికి శిక్ష ఇదేనంటూ..

Published on Sun, 08/17/2025 - 09:01

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మానవత్వం మంటగలిసిన ఉదంతం చోటుచేసుకుంది. సెంట్రల్ ఢిల్లీలోని హౌజ్ ఖాజీ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు తన సొంత తల్లిపై రెండుసార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు.  ఈ ఘటనలో బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తన కుమారుడు  తనకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తనను ‘శిక్షిస్తున్నాడని’ ఫిర్యాదు చేసింది.

బాధిత మహిళ తన కుమార్తెతో కలిసి హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషన్‌కు వచ్చి, తన కుమారునిపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. బాధితురాలి భర్త రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. వీరి కుటుంబం హౌజ్ ఖాజీ ప్రాంతంలో ఉంటోంది. బాధితురాలి పెద్ద కుమార్తెకు వివాహం కాగా, ఆమె  అదే పరిసరాల్లో తన భర్త, అత్తమామలతో ఫాటు ఉంటోంది.

జూలై 17న బాధితురాలు, ఆమె భర్త , చిన్న కుమార్తె సౌదీ అరేబియాకు వెళ్లారు. ఈ సమయంలో నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి, వారిని వెంటనే తిరిగి రమ్మని కోరాడు. తల్లికి వెంటనే విడాకులు ఇవ్వాలని, ఆమెకు కొన్నేళ్లుగా ఇతరులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని తాను కనుగొన్నానని చెప్పాడు. తరువాత కూడా  కుమారుడు ఇదే తరహాలో తండ్రికి ఫోన్లు చేస్తూ వచ్చాడు. ఈ నేపధ్యంలో అరేబియా నుంచి వారి కుటుంబం ఆగస్టు ఒకటిన ఢిల్లీకి తిరిగివచ్చింది.

తల్లిని చూడగానే ఆ కుమారుడు ఆమెపై దాడి చేశాడు. కుమారుని ప్రవర్తనకు భయపడి తల్లి ఇల్లు విడిచిపెట్టి పెద్ద కుమార్తె ఇంటిలో ఆగస్టు 11 వరకూ ఉంది. ఆ తరువాత ఆమె తిరిగి తన ఇంటికి వచ్చింది. ఆరోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో, నిందితుడు తన తల్లితో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నానని చెప్పాడు. తరువాత ఆమెను గదిలో బంధించి, అత్యాచారం చేశాడు. ఆమె ఎంతలా వేడుకున్నప్పటికీ విడిచిపెట్టలేదు. గతంలో ఆమె చేసిన తప్పుకు శిక్షిస్తున్నానని చెప్పాడు.

బాధితురాలు వెంటనే ఈ ఘటన గురించి  ఎవరికీ చెప్పలేదు. అయితే గురువారం తెల్లవారుజామున కుమారుడు ఆమె గదిలోనికి వచ్చి మళ్లీ లైంగిక దాడి చేశాడు. మర్నాడు తల్లి జరిగిన విషయాన్ని చిన్న కుమార్తెకు చెప్పింది. తరువాత వారిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, నిందితునిపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు భారత న్యాయ సంహిత సెక్షన్ 64 (అత్యాచారం) కింద కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్టు చేసి, తదుపరి దర్యాప్తుకు ఉపక్రమించారు.

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)