Breaking News

Delhi Liquor Scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్‌

Published on Sat, 05/18/2024 - 05:13

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎక్సయిజ్‌ విధానంలో అవకతవకల కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శుక్రవారం తాజాగా మరో చార్జ్‌షీట్‌ను దాఖలుచేసింది. ఇందులో ఆమ్‌ ఆద్మీ పార్టీ, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్లను చేర్చింది. మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఇలా ఒక జాతీయ రాజకీయ పార్టీ, ఒక ముఖ్యమంత్రి పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

ఢిల్లీలో ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజాకు ఈడీ 200 పేజీల అభియోగపత్రాలను సమరి్పంచింది. వీటిని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే అంశాన్ని జడ్జి త్వరలో పరిశీలించనున్నారు. ఆప్‌ కన్వీనర్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ ఈ కుట్రలో కేజ్రీవాల్‌ భాగస్వామి అయ్యారని తాజా చార్జ్‌షీట్‌లో ఈడీ ఆరోపించింది. మద్యం కేసులో మొత్తంగా ఈడీ ఇప్పటిదాకా ఎనిమిది చార్జ్‌షీట్‌లు దాఖలుచేసింది. 18 మందిని అరెస్ట్‌చేసింది. 

38 సంస్థలకు ఈ నేరంతో సంబంధముందని పేర్కొంది. రూ.243 కోట్ల విలువైన ఆస్తులను జప్తుచేసింది. ‘‘ కేజ్రీవాల్‌ బసచేసిన ఏడు నక్షత్రాల హోటల్‌ బిల్లును ఈ కేసు నిందితుల్లో ఒకరు చెల్లించారు. ఆ బిల్లులు మా వద్ద ఉన్నాయి’’ అని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు గురువారం సుప్రీంకోర్టులో తెలిపారు.  మనీ లాండరింగ్‌ కేసులో తనను అన్యాయంగా అరెస్ట్‌ చేశారంటూ కేజ్రీవాల్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం రిజర్వ్‌చేసింది. ఈ పిటిషన్‌ను జíస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం శుక్రవారం విచారించింది. కేజ్రీవాల్‌ తరఫున అభిషేక్‌ సింఘ్వీ, ఈడీ తరఫు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్‌చేస్తున్నాం. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)