Breaking News

కవిత కేసులో నేడు ఏం జరగనుందో?

Published on Fri, 05/24/2024 - 08:52

ఢిల్లీ, సాక్షి: లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఈడీ కేసులో ట్రయల్‌ కోర్టు(రౌస్‌ అవెన్యూ కోర్టు) తనకు బెయిల్‌ తిర​స్కరించడాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారామె. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్‌  స్వర్ణకాంత శర్మ బెంచ్‌ ఇవాళ విచారణ జరపనుంది. 

లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అప్రూవర్ల స్టేట్మెంట్లను ఆధారం చేసుకుని తనని ఈ కేసులో ఇరికించారని, స్టేట్మెంట్లు మినహా తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కవిత తన బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసు పెట్టారని ఆమె మొదటి నుంచి వాదిస్తున్నారు. తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అన్నింటికి మించి ఒక మహిళ అయినందున బెయిల్‌తో ఊరట ఇవ్వాలని పిటీషన్‌ ద్వారా కవిత విజ్ఞప్తి చేశారు. ఈడీ ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేసింది కాబట్టి ఆమెకు జ్యుడీషియల్‌ కస్టడీ అవసరం లేదన్నారు.

అయితే.. లిక్కర్ కేసులో కవితే సూత్రధారి , పాత్రధారి అని ఈడీ తొలి నుంచి వాదిస్తోంది. లిక్కర్ పాలసీని అనుకూలంగా తయారు చేయించేందుకు 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ కు చెల్లింపులు చేయడంలో కవితే ముఖ్య భూమిక పోషించారని, పైసా పెట్టుబడి లేకుండా ఇండో స్పిరిట్ లో కవిత 33శాతం వాటా సంపాదించారని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అంతేకాదు.. కవితకు బెయిల్ ఇస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తిగా సాక్షులనూ ప్రభావితం చేయొచ్చని బెయిల్‌ పిటిషన్‌పై గతంలో ఈడీ వాదనలు వినిపించింది కూడా. ఈ నేపథ్యంలో నేటి విచారణ ద్వారా బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ఓ కొలిక్కి వస్తాయా? లేకుంటే విచారణ మళ్లీ వాయిదా పడుతుందా? అనేది చూడాలి.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ.. మార్చి 15న ఆమెను హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్టు చేసింది. మార్చి 26 నుంచి తీహార్‌ జైలులోనే ఉన్నారు. జూన్‌ 3 వరకు కవిత జ్యూడీషియల్‌ రిమాండ్‌ను పొడిగించారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఈడీ ఏడు చార్జిషీట్లు దాఖలు చేసింది.

కవిత బెయిల్ పై ఉత్కంఠ

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)