Breaking News

కవిత విచారణకు ముందర.. బిగ్‌ ట్విస్ట్‌!

Published on Fri, 03/10/2023 - 13:25

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునేందుకు పిటిషన్‌ దాఖలు వేశారు ఈ కేసులో నిందితుడైన అరుణ్‌ రామచంద్ర పిళ్లై. దీంతో ఈడీకి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. 

లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ అయిన పిళ్లై.. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్నివెనక్కి తీసుకునేందుకు ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో తాజాగా పిటిషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో స్పందించాలంటూ ఈడీకి కోర్టు నోటీసులు పంపింది. 

ఇదిలా ఉంటే.. లిక్కర్‌ స్కాంలో ప్రముఖ పాత్ర పోషించారంటూ పిళ్లైను ఈడీ అరెస్ట్‌ చేసి ప్రశ్నించింది. ఈ క్రమంలో.. పిళ్లై , బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తాను బినామీ అని, ఆమె ప్రయోజనాల కోసమే పని చేశానంటూ పిళ్లై వాంగ్మూలం ఇచ్చాడంటూ ఆయన రిమాండ్‌ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది. 

ఆపై లిక్కర్‌ స్కామ్‌లో కవితను ప్రశ్నించేందుకు నోటీసులు కూడా పంపింది. రేపు అంటే శనివారం ఈడీ ఎదుట కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంది కూడా.  ఈ తరుణంలో ఇప్పుడు పిళ్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరడం గమనార్హం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)