Breaking News

ఢిల్లీ పంద్రాగస్టు పంచాయతీ.. జెండా ఎగరేసేది ఆయనే

Published on Tue, 08/13/2024 - 18:16

ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగరవేస్తారనే అనిశ్చితికి తెరపడింది. తాజాగా జెండా ఆవిష్కరణకు ఢిల్లీ హోంమంత్రి కైలాశ్‌ గహ్లోత్‌ పేరును గవర్నర్‌ వీకే సక్సేనా నామినేట్‌ చేసినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్.. హోమ్‌ మం​త్రి  కైలాశ్‌ గహ్లోత్‌ను నామినేట్ చేయడం సంతోషంగా ఉంది. దానికోసం   అవసరమైన ఏర్పాట్లు చేయండి’’ అని ఎల్జీ కార్యదర్శి ఆశిష్ కుంద్రా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌కు లేఖలో పేర్కొన్నారు. 

అంతకు ముందు.. జాతీయ జెండాను ఎగరవేసే అవకాశం మంత్రి అతిశీకి ఇవ్వాలనే సీఎం కేజ్రీవాల్‌  విజ్ఞప్తిపై పరిపాలన శాఖ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది.  ‘‘ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయజెండా ఎగరవేసే అధికారాన్ని ఢిల్లీ మంత్రి అతిశీకి ఇవ్వలేం. ఈ వేడుక నిర్వహించేందుకు నిర్దేశిత విధానం ఉంటుంది. ఆ నిబంధనలు పాటించకుండా అతిశీకి జెండా ఎగరవేసే బాధ్యత అప్పగిస్తే కార్యక్రమం పవిత్రత దెబ్బతింటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొంది.

కాగా.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం తిహార్‌ జైల్లో ఉన్నారు.  అయితే ఆయనకు  స్వాతంత్రవ దినోత్సవం రోజు జాతీయ జెండాను మంత్రి అతిశీ ఎగురవేస్తారని ఎల్జీకి లేఖ రాశారు.  ఈ విషయం ప్రస్తుతం ఎల్జీ వర్సెస్‌ ఆప్‌గా మారింది. తాజాగా రాజ్‌భవన్ విడుదల  చేసిన ప్రకటనపై  మంత్రి అతిశీ స్పందించలేదు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)