Breaking News

ఊపిరిపై పన్నేంటి? 

Published on Thu, 12/25/2025 - 05:56

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గాలి పీల్చడమే గండంగా మారిన వేళ.. ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వంపై, జీఎస్‌టీ కౌన్సిల్‌పై నిప్పులు చెరిగింది. గాలి నాణ్యత ‘అత్యంత ప్రమాదకర’ స్థాయికి పడిపోయి జనం విలవిల్లాడిపోతుంటే, ప్రాణాలను కాపాడే ‘ఎయిర్‌ ప్యూరిఫయర్ల’పై 18 శాతం పన్ను వసూలు చేయడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 

బుధవారం జరిగిన విచారణలో చీఫ్‌ జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ, జస్టిస్‌ తుషార్‌ రావు గెడెలతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘ఒక మనిషి రోజుకు సగటున 21 వేల సార్లు శ్వాసిస్తాడు. ఈ విషతుల్యమైన గాలిని ఇన్నిసార్లు పీల్చడం వల్ల ఊపిరితిత్తులు ఏమవుతాయో ఆలోచించారా? అది మన అదుపులో లేని అనివార్య ప్రక్రియ’.. అని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ‘ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడంలో అధికారులు విఫలమయ్యారు. 

కనీసం తాత్కాలికంగానైనా.. వారం లేదా నెల రోజులు ప్యూరిఫైయర్లపై పన్ను మినహాయింపు ఇవ్వలేరా? ఇదొక అత్యవసర పరిస్థితి అని గుర్తించండి’.. అని ఆదేశించింది. న్యాయవాది కపిల్‌ మదన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ప్రకారం.. ఎయిర్‌ ప్యూరిఫయర్లు విలాసవంతమైన వస్తువులు కావు, అవి ప్రాణరక్షక పరికరాలు. ప్రస్తుతం వైద్య పరికరాలపై కేవలం 5 శాతం జీఎస్‌టీ ఉండగా, ఎయిర్‌ ప్యూరిఫయర్లపై మాత్రం 18 శాతం వసూలు చేస్తున్నారు. భారీ పన్నుల వల్ల సామాన్యులు వీటిని కొనుగోలు చేయలేకపోతున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. వీటిని కూడా వైద్య పరికరాల జాబితాలో చేర్చి పన్ను తగ్గించాలని కోరారు. 

వీడియో కాన్ఫరెన్స్‌లోనైనా భేటీ అవ్వండి!  
జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేయడానికి సమయం పడుతుందని కేంద్రం చెప్పగా, కోర్టు దాన్ని తోసిపుచ్చింది. ‘పరిస్థితి తీవ్రతను బట్టి భౌతికంగా వీలు కాకపోతే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అయినా వెంటనే సమావేశమై పన్ను తగ్గింపుపై నిర్ణయం తీసుకోండి’.. అని స్పష్టం చేసింది. ఈ అంశంపై కేంద్రం తన నిర్ణయాన్ని తెలియజేయడానికి డిసెంబర్‌ 26వ తేదీకి శుక్రవారం కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. 
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)