Breaking News

విజయసాయి రెడ్డిపై తప్పుడు కథనాలు.. ఎల్లో మీడియాపై హైకోర్టు సీరియస్‌!

Published on Tue, 08/13/2024 - 21:05

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో ఎల్లో మీడియాకు బిగ్‌ షాక్‌ తగిలింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ప్రసారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలని తొమ్మిది మీడియా సంస్థల(ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ-5, మహాన్యూస్‌, ఆర్‌ టీవీ సహా మరో నాలుగు ఛానెల్స్‌)ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఎల్లో మీడియాపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కాగా, ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎ‍ల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పరువుకు భంగం కలిగించినందుకు రూ.10 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని విజయసాయిరెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.

ఇక, విచారణ సందర్బంగా.. ఎంపీ విజయసాయిరెడ్డి పరువుకు భంగం కలిగించే విధంగా తొమ్మిది మీడియా సంస్థలు(ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ-5, మహాన్యూస్‌, ఆర్‌ టీవీ సహా మరో నాలుగు ఛానెల్స్‌) వ్యవహరించాయి. వదంతుల ఆధారంగా తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. ఆయన ప్రతిష్టకు, రాజకీయ భవిష్యత్‌కు భంగం కలిగే విధంగా మీడియాలో తప్పుడు ప్రసారాలు అందించారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా ప్రసారం చేసిన కథనాలను, వీడియోలను వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న కథనాలన్నింటినీ వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు కథనాలను ప్రజలకు అందించవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది.  


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)