Breaking News

కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు

Published on Thu, 10/19/2023 - 08:57

ఢిల్లీ: ఢిల్లీలో నివసిస్తున్న కశ్మీరీ వలస కుటుంబాలకు ఇస్తున్న పరిహారాన్ని రూ.10,000 నుంచి రూ. 27,000లకు పెంచుతూ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాకుండా కొత్త కశ్మీరీ మైగ్రెంట్‌ కార్డులు జారీ చేయడానికి కూడా ఎల్జీ అనుమతినిచ్చారు. ఇప్పటికే ఉన్న కార్డులలో కొత్త పేర్లను జత చేయడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెద్దైన పిల్లలు, కొత్తగా వివాహమైన వారికి కొత్తగా కార్డులను ఇవ్వనున్నారు. వలసదారు కాని యువతి, వలసదారుల కుటుంబానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే.. అలాంటివారికి కూడా అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

కశ్మీర్‌లో ఉగ్రవాదం కారణంగా వలస వచ్చిన వారికి ఢిల్లీలో చాలాకాలం క్రితం పునరావాసం కల్పించిన విషయం తెలిసిందే.  ఇలాంటి వారికి 1989-90లలోనే  ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించడం మొదలుపెట్టంది.  2007లో ఈ ఆర్ధిక సహాయాన్ని రూ.5000 నుంచి రూ.10,000లకు పెంచారు. ఆ తరువాత సాయాన్ని మరింత పెంచింది ఇప్పుడే. పెంపుతో ఇప్పుడు వలసదారులకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.27,000లకు చేరింది. 

కశ్మీర్‌లోయ  ఉగ్రవాదం చెలరేగడంతో 1989-90లలో  హిందువులతో పాటు వివిధ మతాల ప్రజలు ఆ ప్రాంతాన్ని వీడారు. దాదాపు  60,000 వేల కుటుంబాలు కశ్మీర్‌లోయను వీడి జమ్మూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్ధిరపడ్డారు. అందులో సుమారు 23,000 కుటుంబాలు   ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డాయి.    

ఢిల్లీలో ప్రస్తుతం 2000 కశ్మీరీ వలస కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడంతో ఇప్పుడు  ఆ సంఖ్య దాదాపు 70 శాతం పెరిగే అవకాశం ఉంది. కేంద్ర రక్షణ సంబంధిత నిధుల నుంచి వీరికి ఆర్ధిక సహాయం అందుతోంది. 

ఇదీ చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకం


     

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)