Breaking News

కాలుష్యం కోరల్లో ఢిల్లీ.. బాణా సంచాపై నిషేధం

Published on Mon, 10/14/2024 - 15:20

ఢిల్లీ : దీపావళికి ముందే ఢిల్లీలో వాయి కాలుష్యం భారీగా పెరిగింది. ఢిల్లీలో ఎయిర్‌ ఇండెక్స్‌ క్వాలిటీ 221గా నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు టపాసుల కాల్చివేతపై నిషేధం విధించింది.

అంతేకాదు, అన్నీ రకాల బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకాలు నిర్వహించకుండా నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు కొత్త నిబంధనలు వెంటనే అమ్మల్లో​కి తెచ్చేలా కార్యచరణను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

దేశ వ్యాప్తంగా పండుగ సీజన్‌ కొనసాగుతుంది. ఈ తరుణంలో ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి (డీపీసీసీ) ఢిల్లీలో గాలి కాలుష్యంపై దృష్టి సారించింది. పండుగ సీజన్‌లో ముఖ్యంగా నిన్నటి దసరా వరకు గాలి నాణ్యత భారీగా తగ్గినట్లు గుర్తించింది.

అదే సమయంలో ఢిల్లీలో గాలి నాణ్యతను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) విశ్లేషించింది. ఆదివారం మద్యాహ్నం 4గంటల వరకు ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) 224కి చేరింది.  ఈ నేపథ్యంలో ఢిల్లీ పొల్యూషన్‌ బోర్డ్‌ బాణా సంచాపై నిషేధం విధించింది. దీంతో ఢిల్లీ వాసులు బాణా సంచా కాల్చకుండానే ఈ దీపావళి జరుపుకోనున్నారు.

గాలిలో నాణ్యత ఎలా ఉంటే మంచిది..

సాధారణ గాలి ఏక్యూఐ 0–50 మంచి గాలి.. ఇబ్బంది లేదు.

51 – 100 పర్వాలేదు.. చిన్న చిన్న స్థాయిలో రోగాలు

101 – 150 శరీరంపై చిన్నదద్దుర్లు, ఎలర్జీ, నీరసం

151 – 200 ఊపిరితిత్తులు, గుండె సమస్యలు వస్తాయి, కళ్లు తిరుగుతాయి.

201 – 300 ఊపిరితిత్తులు, గుండె వ్యాధులు, దీర్ఘకాలిక సమస్యలుగా మారిపోతాయి. కిడ్నీలపై ప్రభావం వాటి సమస్యలు

300+ అయితే ఆ ప్రాంత గాలి పిలిస్తే నిత్యం ప్రమాదమే.. అనేక రోగాలబారిన పడతారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)