Breaking News

IAS Officer: ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి.. అలా చేయడంతో షోకాజ్‌ నోటీసులు

Published on Mon, 05/15/2023 - 16:54

ఢిల్లీలోని బ్యూరోక్రాట్‌ల నియంత్రణ, పోస్టింగ్‌పై కేంద్రంతో జరిగిన తగాదా కేసులో సుప్రీం కోర్టు ఆప్‌ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం రంగం చేసింది. అదీగాక సుప్రీం కోర్టు నుంచి ఈవిధంగా తీర్పు వెలువడిన వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అవినీతి అధికారులను తొలగించి కష్టపడి పనిచేసే అధికారులను తీసుకొచ్చేలా బదిలీలు ఉంటాయని ప్రకటించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీ, ఐఏఎస్‌ అధికారి ఆశిష్‌ మోర్‌ పదవీచ్యుత్తులయ్యారు. 

ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం బదిలీ ఉత్తర్వును ఉల్లంఘించిన ఐఏఎస్‌ అధికారి ఆశిష్‌ మోర్‌కు ఈ నెల 13న షోకాజ్‌ నోటీసులు పంపింపించింది. ఆ అధికారి సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించనందుకు గానూ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడా యోచిస్తున్నట్లు తెలిపింది. దీనిపై 24 గంటల్లో ఆశిష్‌ మోర్‌ నుంచి సమాధానం కూడా కోరింది ఢిల్లీ ప్రభుత్వం. ఈ మేరకు సేవల శాఖ(సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌) మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ..కొత్త అధికారిని ఆయన స్థానంలో బదిలీ చేసేందుకు ఫైల్‌ సమర్పించమని సేవల కార్యదర్శి ఆశిష్‌ మోర్‌ని ఆదేశించినట్లు తెలిపారు.

ఐతే ఆయన మంత్రి కార్యాలయానికి తెలియజేయకుండా సచివాలయానికి వెళ్లిపోయారని ఆరోపించారు. ఫోన్‌ని కూడా స్విచ్‌ ఆఫ్‌లో పెట్టుకుని పరారిలో ఉన్నారని మండిపడ్డారు. ఆ అధికారికి ఈ విషయాన్ని అధికారికంగా ఆయన వాట్సాప్‌, ఈమెయిల్‌ ద్వారా తెలియజేసినప్పటికీ అతని నుంచి ఎటువంటి స్పందన లేదని చెప్పారు. ఆయన బదిలీ అయ్యేందుకు సిద్ధంగా లేరని కూడా ఆరోపించారు. మోర్‌ మే 21 2015 నాటి హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను ఇంకా పక్కన పెట్టలేదని సూచిస్తూ.. షోకాజ్‌ నోటీసులు పంపినట్లు మంత్రి సౌరబ్‌ భరద్వాజ్‌ పేర్కొన్నారు.

దీనిపై త్వరితగతిన ఆశిష్‌ మోర్‌ వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, సేవల నిర్వహణపై ఢిల్లీ ప్రభుత్వానికి శాసన కార్యనిర్వాహక అధికారాలు ఉన్నాయని గతవారమే సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఢిల్లీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయని అధికారులపై ఈ విథంగా కఠిన చర్యలు తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది.

(చదవండి: కర్ణాటక సీఎం ఎపిసోడ్‌పై సస్పెన్స్‌.. ‘నేనే సీఎం అవుతానని ఆశిస్తున్నా’)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)