Breaking News

ఇలా సెలవులిచ్చారు.. అలా క్యాన్సిల్‌ చేశారు!

Published on Sun, 01/07/2024 - 07:50

దేశ రాజధాని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బుధవారం వరకు పాఠశాలలకు సెలవులు పొడిగిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంది. సెలవులు పొడిగిస్తూ సర్క్యులర్ జారీ చేసిన గంటలోపే విద్యాశాఖ డైరెక్టరేట్ ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. సెలవు పొడిగింపుపై తగిన నిర్ణయం తీసుకున్న తర్వాత ఢిల్లీ ప్రభుత్వ విద్యా డైరెక్టరేట్ కొత్తగా మళ్లీ సర్క్యులర్ జారీ చేయనుంది.

దేశ రాజధాని ఢిల్లీలో చలిగాలులు, పొగమంచు కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలకు సెలవులు పొడిగించారు. జనవరి 10 వరకు పాఠశాలలు మూసివేయాలని విద్యాశాఖ డైరెక్టరేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే పొరపాటుగా సెలవుల ఉత్తర్వు జారీ అయ్యిందని విద్యా శాఖ పేర్కొంది. సెలవుల పొడిగింపుపై ఆదివారం తుది నిర్ణయం తీసుకోనున్నారు.

దేశంలోని చాలా రాష్ట్రాల్లో విపరీతమైన చలిగాలుల వీస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా  ఉంది. పగటిపూట సూర్యకాంతి చాలా తక్కువగా ఉంటోంది. దట్టమైన పొగమంచు కారణంగా, విమానాలు, రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అటువంటి పరిస్థితిలో విద్యార్థులకు పిల్లలకు ఉపశమనం కలిగించేందుకు శీతాకాలపు సెలవులను పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)